- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nitish Kumar Reddy : బోర్డర్ గవాస్కర్ సిరీస్ సెంచరీ వీరుల్లో నితీష్ కుమార్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) తన అంతర్జాతీయ టెస్టు కెరీర్ లో మొదటి సెంచరీ(First century) నమోదు చేసి సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో ఈ బోర్డర్ గవాస్కర్ సిరీస్ తొలి టెస్టుతో అరంగేట్రం చేసిన 21 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాల్గవదైన బాక్సింగ్ డే టెస్టులో 171 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో సెంచరీ మైలురాయిని చేరుకున్నాడు. మొత్తంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar series)లో విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ తర్వాత సెంచరీ చేసిన మూడో భారతీయ బ్యాటర్ గా నితీష్ కుమార్ రెడ్డి నిలిచాడు. ఎనిమిదో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా రికార్డు సాధించాడు. నితీష్ ఈ సిరీస్ ప్రతీ మ్యాచ్‌లోనూ ఆకట్టుకున్నాడు. భారత జట్టుకు అవసరమైన పరుగులు అందిస్తూ, అటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు.
ఆస్ట్రేలియాలో భారత్ తరపున అత్యంత సెంచరీలు చేసిన పిన్న వయస్కులలో నితీష్ కుమార్ రెడ్డి నాల్గవ వాడు కావడం విశేషం. సచిన్ టెండూల్కర్ – , 18 ఏళ్ల 253 రోజులకు 1992లో 148 నాటౌట్ పరుగులు, అలాగే అదే ఏడాదిలో సచిన్ టెండూల్కర్ – 114, 18 ఏళ్ల 283 రోజులకు 114పరుగులు చేశాడు. రిషబ్ పంత్ – 21ఏళ్ల 91 రోజులు, 2019లో 159 నాటౌట్ పరుగులు చేయగా, ఈ సిరీస్ లో నితీష్ కుమార్ రెడ్డి – 21 ఏళ్ల 214 రోజుల వయసులో 105నాటౌట్ పరుగులు చేశాడు. అయితే బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా నితీశ్ కుమార్ రెడ్డి నిలిచాడు. అతని కంటే ముందు, కార్ల్ హూపర్ 21ఏళ్ల 11 రోజుల వయస్సులో బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ సాధించాడు.
నాల్గవ టెస్టు మూడవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 358/9 పరుగులు సాధించింది. వాషింగ్టన్ సుందర్(50), నితీష్ లు ఎనిమిదవ వికెట్ కు 127పరుగులు జోడించడంతో భారత్ ఫాలోఆన్ తప్పించుకుంది. ప్రస్తుతం క్రీజులో నితీశ్ కుమార్(105), సిరాజ్(2) నాటౌట్ గా ఉన్నారు. అసీస్ తొలి ఇన్నింగ్స్ లో 474పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ ఇంకా 116పరుగులు వెనుకబడి ఉంది.