DCM:పిల్లాడిని భుజంపై కూర్చోబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. వైరలవుతోన్న ఫొటోస్!

by Jakkula Mamatha |
DCM:పిల్లాడిని భుజంపై కూర్చోబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. వైరలవుతోన్న ఫొటోస్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు(శనివారం) కర్నూలు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను సనాతన ధర్మాన్ని పాటిస్తూ అన్ని మతాలను గౌరవిస్తానని తెలిపారు. తన జీవితంలో ఎప్పుడు కులం, మతం పాటించలేదని అన్నారు. రాష్ట్రంలోని బుడగ జంగాలకు న్యాయం చేస్తాం అన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించామని పేర్కొన్నారు. ఇక పై ప్రతి జిల్లాలో పర్యటిస్తా అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

క్యాంపు ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) కర్నూల్ పర్యటనలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓర్వకల్లు మండలం పూడిచర్ల బహిరంగ సభ వేదికపైకి ఆయన చేరుకోగా ఓ పిల్లాడు ఎర్ర టవల్ తలకు కట్టుకుని కనిపించాడు. ఈ క్రమంలో ఆ పిల్లాడిని పవన్ కళ్యాణ్ చూశారు. దీంతో జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ వెంటనే అతనిని స్టేజీపైకి పిలిపించుకున్నారు. ఈ తరుణంలో ఆ పిల్లాడిని భుజం పై కూర్చోబెట్టుకుని ముద్దాడారు. ఈ వీడియోను జనసేన శ్రేణులు సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed