భవిష్యత్ తరాలకు ఇబ్బందులు లేకుండా చూడాలి.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |
భవిష్యత్ తరాలకు ఇబ్బందులు లేకుండా చూడాలి.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) హితవు పలికారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని (World Water Day) ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వీడియోలో పొన్నం మాట్లాడుతూ.. ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం.. మనం నీటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్న దినం అని అన్నారు. నీటి దినోత్సవం సందర్భంగా ప్రజలు అందరూ ఒక సంకల్పం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) పక్షాన విజ్ఞప్తి (Request) చేశారు. అలాగే నీటిని పొదుపుగా వాడుకుందాం అని, వచ్చే తరాలకు అవకాశాలు ఇద్దామని సూచించారు.

అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఇబ్బందుల్లో పడొద్దని అన్నారు. అంతేగాక గ్రౌండ్ వాటర్ (Ground Water) పడిపోతున్న సందర్భంగా గ్రౌండ్ వాటర్ కాపాడుకునే ప్రయత్నాలు తీసుకోవాలని తెలిపారు. ఇక హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ (Hyderabad Metro Water Works) తీసుకుంటున్న కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకోవాలని, భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా అందరూ స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేయాలని, నీటిని పొదుపు చేసే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇక ఈ సందర్భంగా మనం ఒక సంకల్పం తీసుకొని ప్రతిజ్ఞ తీసుకోవాలని మంత్రి కోరారు.

Next Story

Most Viewed