- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Betting Apps: బెట్టింగ్ యాప్స్.. మూలాలపై గురి! 19 మంది యాప్ యజమానులపై కేసులు

దిశ, డైనమిక్ బ్యూరో: బెట్టింగ్‌యాప్‌ల మూలాలపై పోలీసులు గురిపెట్టారు. ఇప్పటి వరకు యాప్‌ను ప్రమోట్‌చేసిన సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు యాప్‌ల యజమానులపై చర్యలకు రెడీ అయ్యారు. మొత్తం 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జంగిల్ రమ్మి డాట్ కామ్, ఏ 23, యోలో 247, ఫెయిర్ ప్లే, జీత్‌విన్, విబుక్, తాజ్ 77, వివి బుక్, ధనిబుక్ 365, మామ247, తెలుగు365, ఎస్365, జై365, జెట్‌ఎక్స్, పరిమ్యాచ్, తాజ్777బుక్, ఆంధ్రా365 యజమానులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఇప్పటికే సినీ ప్రముఖులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు సహా 25 మందిపై కేసు నమోదు చేశారు. తాజాగా యాప్‌ల యజమానులపై కేసులు చేసి మొత్తం 19 మందిని నిందితులుగా చేర్చి విచారణ చేపట్టనున్నారు. ఇందుకోసం కేసులో కొత్త సెక్షన్లను జోడిస్తున్నారు.
బెట్టింగ్‌యాప్‌ల ప్రమోషన్వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. పలువురు ఇన్ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని విచారణకు పిలుస్తున్నారు. వారిలో యాంకర్లు, యూట్యూబర్స్ఉన్నారు. బెట్టింగ్‌యాప్‌ల ప్రమోషన్లలో ప్రకాష్‌రాజ్ వంటి ప్రముఖులు కూడా ఉండడం అందరి దృష్టి దీనిపై మరలింది. అయితే తిమింగలాలను వదిలేసి.. చిన్న చేపలను పట్టుకుంటున్నారనే విమర్శలకు కూడా వచ్చాయి. ఈ యాప్‌ల వల్ల నష్టపోయిన యువతలో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చట్టవిరుద్ధమైన ఈ యాప్‌ను వాడి వందలాదిమంది రోడ్డున పడ్డారు. యాప్‌ల ప్రమోటర్లపై కేసులు నమోదు చేయడంతో పోలీసులు దీనిని సీరియస్‌గా తీసుకున్నారని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో బెట్టింగ్‌యాప్ నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేయడం సంచలనం రేకెత్తించింది. బెట్టింగ్మూలాలను తుడిచి వేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలను సాక్షులుగా మార్చి యజమానులను అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.