Breaking: జైలు నుంచి పోసాని విడుదల.. వారిని చూసి ఒక్కసారిగా భావోద్వేగం

by srinivas |   ( Updated:2025-03-22 11:42:59.0  )
Breaking: జైలు నుంచి పోసాని విడుదల.. వారిని చూసి ఒక్కసారిగా భావోద్వేగం
X

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి(Posani Krishna murali) జైలు నుంచి విడుదల అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన(Janasena) పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) పై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో గత నెల 26న ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోసం సుదీర్ఘ విచారణ జరిగింది. తాజాగా కోర్టు బెయిల్ మంజూరు(Bail Grant) చేయడంతో గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదల అయ్యారు. దీంతో జైలు వద్ద పోసానిని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) పరామర్శించారు. అంబటిని చూసిన పోసాని వెంటనే భావోద్వేగానికి గురయ్యారు. అంబటిని హత్తకుని కంటతడి పెట్టుకున్నారు. జైలు నుంచి పోసాని విడుదల అవుతున్న విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు భారీగా చేరుకుని అప్యాయంగా పలకరించారు. తన కోసం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు అంటూ పోసాని భావోద్వేగానికి గురయ్యారు.

Next Story