ఇంతకీ ఆ చెరువు వద్ద చనిపోయింది ఎవరు..?

by Kalyani |
ఇంతకీ ఆ చెరువు వద్ద చనిపోయింది ఎవరు..?
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : ఓ వ్యక్తి చెరువు వద్ద మృతి చెంది ఉన్నాడు. అతడు చనిపోయి సుమారు 5 నెలలు గడుస్తున్నా ఎవరు గుర్తించలేకపోయారు. శనివారం బర్రెలు కాపేందుకు అటుగా వెళ్లిన ఓ వ్యక్తి చెరువు పక్కన ఓ మనిషి మృతదేహం సంబంధించిన ఎముకలను చూసి షాక్ కి గురయ్యాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

చనిపోయి 5 నెలలు కావస్తోంది..

కంది మండలం చిమ్మాపూర్ తండా ధర్మసాగర్ చెరువు ఒడ్డున మగ వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. అతడి మృతదేహానికి సంబంధించిన ఎముకలు మాత్రమే మిగిలి కనిపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వాటిని బయటకు తీసి చనిపోయింది ఇంతకీ ఎవరు అనే కోణంలో విచారిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి నల్ల రంగు టీ షర్ట్ ధరించి ఉండగా, దానిపై 07 అనే నెంబర్ ముద్రించి ఉన్న టీ షర్ట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం ఎముకలను బట్టి చూస్తే అతడు చనిపోయి సుమారు మూడు నుంచి ఐదు నెలల కాలం కావస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా మిగతా వివరాలను సేకరిస్తున్నట్లు వివరించారు. ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే సంగారెడ్డి రూరల్ ఎస్సై 8712656746 నెంబర్ కు సమాచారం అందించాలని ఎస్సై సూచించారు.

Next Story