కెమెరా మ్యాన్‌కు పడిపోయిన రష్మిక.. నా హార్ట్ గెలుచుకున్నావంటూ.. (వీడియో)

by sudharani |
కెమెరా మ్యాన్‌కు పడిపోయిన రష్మిక.. నా హార్ట్ గెలుచుకున్నావంటూ.. (వీడియో)
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది ‘పుష్ప-2’(Pushpa-2)తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు రీసెంట్‌గా ‘ఛావా’(Chhaava)తో మరో సూపర్ హిట్ అందుకుంది. ఇలా వరుస హిట్స్ సాధిస్తున్న రష్మిక త్వరలో ‘సికందర్’ (Sikandar)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఏఆర్ మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రతి అప్‌డేట్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చెయ్యగా.. హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ మూవీ ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాను మరింతగా ఆడియన్స్‌లోకి తీసుకెళ్తున్నారు చిత్ర బృందం.

తాజాగా ఓ ఎయిర్ పోర్ట్‌లో రష్మిక మందన్న దర్శనమిచ్చింది. అక్కడికి కొంతమంది మీడియా వాళ్లు వెళ్లగా.. అందులో ఓ కెమెరా మ్యాన్ రష్మికకు స్పెషల్‌గా డ్యాన్స్‌తో తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ డ్యాన్స్‌కు ఫిదా అయిన రష్మిక.. లవ్ సింబల్ పెడుతూ ‘మీరు నా హార్ట్ గెలుచుకున్నారు’ అని కామెంట్ చేసింది. ఇక డ్యాన్స్ అనంతరం ఆ వ్యక్తి కెమెరా తీసుకుని యథావిధిగా రష్మికను వీడియో తీశాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ‘వావ్.. క్యూట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story

Most Viewed