- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్టార్ హీరోతో ఆ పని చేయాలన్న కోరిక నెరవేరింది.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, డైరెక్టర్ ఖలీస్ కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ ‘బేబీ జాన్’. మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. అయితే ఈ చిత్రంలో నటించిన బాలీవుడ్ బ్యూటీ వామిక గబ్బి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ‘సల్మాన్ ఒక అయస్కాంతం లాంటి వ్యక్తి. నిజంగా ఆయనతో ఎవరైనా పని చేస్తే ఆకర్షితులవ్వాల్సిందే. ఆయన దగ్గర ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. బేబీ జాన్‌లో సల్మాన్‌తో కలిసి నటించడం అంతా ఒక కలలా అనిపించింది. ఈ సినిమాతో ఆయనతో పని చేయాలనే నా కోరిక నెరవేరింది. తక్కువ సమయంలో నాకు ఇలాంటి గొప్ప అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని వామిక చెప్పుకొచ్చింది. కాగా ‘బేబీ జాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ కామియో రోల్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.