Shocking: మీసేవ పేరుతో ఫేక్ వెబ్‌సైట్.. తస్మాత్ జాగ్రత్త..!

by Maddikunta Saikiran |
Shocking: మీసేవ పేరుతో ఫేక్ వెబ్‌సైట్.. తస్మాత్ జాగ్రత్త..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో గత కొంత కాలంగా సైబర్ మోసాలు(Cyber Frauds) భారీగా పెరిగిపోయినా విషయం తెలిసిందే. సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రోజుకో అవతారమెత్తి దోపిడీకి పాల్పడుతున్నారు. నకిలీ వెబ్‌సైట్లతో నేరగాళ్లు ప్రజలను మోసం చేసి డబ్బు దోచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొందరు కేటుగాళ్లు తెలంగాణ ప్రభుత్వ(TG Govt) మీసేవ(Meeseva) పేరుతో ఫేక్ వెబ్‌సైట్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడ్డ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మీ సేవ వెబ్‌సైట్ meeseva.telangana.gov.in కాగా meesevatelangana.in పేరుతో నకిలీది సృష్టించారు. ఇందులో కొత్తగా మీసేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామంటూ హైదరాబాద్(HYD) కలెక్టర్‌ అనుదీప్‌(Collector Anudeep) పేరుతో నకిలీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చాలా మంది ఆశావహులు అది నిజమని నమ్మి ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ మీ సేవ ఆపరేటర్ల సమాఖ్య కలెక్టర్‌తో పాటు ఐటీ శాఖ(IT Dept) దృష్టికి తీసుకెళ్లింది. ఐటీ శాఖతో పాటు సైబర్‌ సెల్‌కు(Cyber Cell) ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ వెబ్‌సైట్ బ్లాక్(Block) చేసి దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఇలాంటి ఫేక్ వెబ్‌సైట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులకు మనీ ట్రాన్సక్షన్స్ చేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Next Story

Most Viewed