Apple: యాపిల్‌ యూజర్లకు కేంద్రం హెచ్చరిక

by Rani Yarlagadda |
Apple: యాపిల్‌ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: యాపిల్ ఫోన్లలో అయితే డేటా లీక్ (Apple Phones Data Leak) అయ్యే రిస్క్ ఉండదని చాలా మంది ఆ ఫోన్లను వాడేందుకే మొగ్గుచూపుతున్నారు. యాపిల్ ఫోన్ కొనేంత సొమ్ము లేకపోయినా.. ఈఎంఐ ఆప్షన్ తీసుకుని కొంటున్నారు. కానీ.. యాపిల్ సాఫ్ట్ వేర్ల (Apple Software)లో లోపాలున్నాయని, వాటిలోని డేటా కూడా చోరీకి గురయ్యే అవకాశం ఉందంటూ ఇండియన్ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ బాంబ్ పేల్చింది. దీంతో యాపిల్ ఫోన్లు, ఐప్యాడ్, మాక్ బుక్ లను వాడే యూజర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

యాపిల్ ప్రొడక్ట్స్ లో 2 రకాల బలహీనతలను గుర్తించినట్లు ఇండియన్ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ అడ్వైజరీ తెలిపింది. వాటి ద్వారా సైబర్ అటాకర్స్ (Cyber Attackers) ఎక్స్ ఎస్ఎస్ దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా.. యాపిల్ ఐఓఎస్, ఐపాడ్ ఓఎస్ లలో 18.1.1, 17.7.2 ముందు వెర్షన్లు, మ్యాక్ ఓఎస్ సుక్వోయా 15.1.1 ముందు వెర్షన్లు, 2.1.1 ముందు వెర్షన్లు, యాపిల్ విజన్ ఓఎస్ 2.1.1 ముందు వెర్షన్, యాపిల్ సఫారీ 18.1.1 ముందు వెర్షన్లు వాడే యూజర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆయా వెర్షన్లు వాడే యూజర్లు.. యాపిల్ సెక్యూరిటీ అప్డేట్స్ కు అనుకూలంగా చర్యలు తీసుకోవాలని, సాఫ్ట్వేర్ వెర్షన్లను ఇన్ స్టాల్ చేయించుకోవాలని సూచించింది. ఈ ఏడాది ఏప్రిల్ లో కూడా యాపిల్ కు చెందిన కొన్ని వెర్షన్లలో లోపాలున్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed