- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Brain Exercises: మీ బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలా..? అయితే వీటిని ట్రై చేయండి!
దిశ, ఫీచర్స్: ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎన్నో ఒత్తిళ్లను మెదడు ఎదుర్కొంటుంది. దీని వల్ల మెదడు పనితీరుపై ప్రభావం పడి, చేసే పనిపై ఏకాగ్రత ఉండదు. ఏదైనా విషయం గురించి ఆలోచించాలన్నా లేదా సరైన నిర్ణయం తీసుకోవాలనుకున్నా మెదడు పాత్ర కీలకంగా ఉంటుంది. ఇది అనేక నాడుల సమూహం. అటువంటి మెదడు చురుగ్గా, పవర్‌ఫుల్‌గా పనిచేయాలంటే కొన్నింటిని అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాట్ల కారణంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. మరి మెదడుకు పదును పెట్టే ఆ అలవాట్లు ఏంటో ఇక్కడ చదివేయండి.
వ్యాయామం:శరీరంలో రక్తం సరఫర సరిగా జరగాలంటే వ్యాయమం తప్పనిసరిగా చేయాలని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం, జాగింగ్, నడక, తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శారీరక వ్యాయామం శరీరాన్ని దృఢంగా మార్చుతుంది. ప్రతి రోజూ ఉదయం వ్యాయామం చేయడం వల్ల కొత్త న్యూరాన్ల పెరుగుదలను ఇది ప్రోత్సహిస్తుంది.
ధ్యానం: ప్రతి రోజూ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని 10 నుండి 20 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
జర్నలింగ్: జర్నలింగ్ చేయడం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. భావోద్వేగాలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. మీ లక్ష్యాలను, ప్రణాళికలు, ఆలోచనలకు 10 నిమిషాలు కేటాయించి రాయడం వల్ల ఆలోచన శక్తి మెరుగుపడుతుంది.
సుడోకు: ఇది సమస్య పరిష్కార నైపుణ్యంను మెరుగుపరుస్తుంది. మెదడును పదును పెట్టేందుకు ఇది సహాయపడుతుంది. క్రాస్‌వర్డ్ పజిల్ లేదా సుడోకు పరిష్కరించడానికి 10 లేదా 15 నిమిషాలు కేటాయించండి.
జిగ్సా పజిల్స్: సాధారణంగా వీటిని ఎక్కువగా చిన్న పిల్లలు ఆడుతుంటారు. కొన్ని ముక్కలన్నింటిని సరైన పద్ధతిలో కలిపితే ఒక ఆకారం వస్తుంది. అదే జిగ్సా పజిల్. వీటిని ఆడడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. మెదడుకు పని చెప్పడం వల్ల మెదడు కణాలు యాక్టివ్‌గా ఉంటాయి.
పుస్తకాలు చదవడం: పుస్తకాలు చదవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఎలాంటి పుస్తకాన్ని అయినా కొంతసేపు చదివడం వల్ల మెదడుకు ప్రశాంతత లభిస్తుంది.
పాజిటివ్ థింకింగ్: చాలామంది ప్రతీ చిన్న విషయాన్ని కూడా నెగిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటారు. ఈ నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టి, పాజిటివ్‌గా ఆలోచించడం వల్ల శరీరంలోని ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లు తగ్గిపోతాయి.
సంగీతం, డ్యాన్స్: సంగీతం వినడం, డాన్స్ చేయడం వంటివి చేయడం వల్ల మెదడులోని నరాలు ఉత్తేజితం అవుతాయి. దీని వల్ల మెదడు నరాల పనితీరు మెరుగుపడి, క్రియేటివ్ స్కిల్స్ పెరుగుతాయి.
నిద్ర: సరైన సమయంలో నిద్రపోవడం వల్ల బ్రెయిన్‌కు రెస్ట్ దొరుకుతుంది. ప్రతి రోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం వల్ల మైండ్ రీఫ్రెష్ అయ్యి, మెమోరీ పవర్ బాగా పెరుగుతుంది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.