Oscar: 2025 : ఆస్కార్ బరిలో అమీర్ ఖాన్ సినిమా ‘లాపతా లేడీస్’

by sudharani |
Oscar: 2025 : ఆస్కార్ బరిలో అమీర్ ఖాన్ సినిమా ‘లాపతా లేడీస్’
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో, అమీర్ ఖాన్ నిర్మించిన చిత్రం ‘లాపతా లేడీస్’. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా తాజాగా అరుదైన ఘనత సాధించింది. 2025 ఆస్కార్‌కు మన భారతదేశం నుంచి ఎంపికైంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఓ పోస్ట్ పెట్టింది. కాగా.. 2001 కాలపు నాటి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం.. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైన సంఘటన ఆధారంగా రూపొందించారు. ఇటీవల విడుదలైన ‘లాపతా లేడీస్’ మూవీ సూపర్ సక్సెస్ అందుకోవడంతో పాటు.. ప్రతిష్టాత్మక టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో లాస్ట్ ఇయర్ ఈ మూవీని ప్రదర్శించడం విశేషం.

Next Story

Most Viewed