- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇత్తడిలో ఎవరైనా బంగారం కలుపుతారా?.. లడ్డూ వివాదంపై పొన్నవోలు ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లడ్డూ(Tirupati Laddu) తయారీకి వాడే నెయ్యిలో పంది కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు చెప్పారు. రూ.320కి సరఫరా చేసే నెయ్యిలో అంతకంటే ఖరీదైన వస్తువుతో కల్తీ చేస్తారా? అని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి(Ponnavolu Sudhakar Reddy) ప్రశ్నించారు. సోమవారం ఆయన తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాగి చెంబుకు బంగారంతో కల్తీ చేస్తారా? ఇత్తడిలో ఎవరైనా బంగారం కలుపుతారా? అని అడిగారు. వాల్యూ తక్కువ ఉందంటే కల్తీ జరిగిందని అర్థం. పశువుల కొవ్వు కలిసినట్లు రిపోర్టులో లేదని ఆయన అన్నారు. లడ్డూ అంశంలో నిజానిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. నిట్ దర్యాప్తు(SIT investigation)తో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదని అన్నారు. సుప్రీంకోర్టు(Supreme Court) రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఆహార నిపుణులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సర్టిఫికెట్ ఉంటేనే ట్యాంకర్లు తిరుమలకు వస్తాయని.. టెస్టుల్లో ఫెయిల్ అయితే వాటిని వెనక్కి పంపిస్తారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నానికి టీటీడీ(TTD) ఒడగట్టిందని ఆరోపించారు. ఇది ఒక పార్టీ, ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదని. కోట్లాదిమంది భక్తుల విషయమని చెప్పారు. ఈ ప్రచారంలో నిజాలు నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిల్ దాఖలు చేశారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గుర్తుచేశారు. తొలుత ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని అనుకున్నామని.. కానీ ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు సంబంధించిన విషయం కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెప్పారు.