- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనిషి చితాభస్మంతో రూ.400 కోట్లు.. ఎలాగంటే?
దిశ, వెబ్ డెస్క్: మనిషిగా పుట్టినవారెవరైనా మరణించాక బూడిదై మట్టిలో కలిసిపోవాల్సిందే. కొందరు దహనం చేశాక ఈ బూడిదను పవిత్ర నదుల్లో కలుపుతారు. ఇది భారతదేశంలో పాటించే ఒక సంప్రదాయం. కానీ.. మనిషి బూడిదతోనే ఒక దేశ ప్రభుత్వం వందలకోట్లు సంపాదిస్తుందంటే నమ్ముతారా ? అసలు అలా ఎందుకు చేస్తోంది ? దానివల్ల గవర్నమెంట్ కి ఏంటి లాభం అనే డౌట్లు మీక్కూడా వచ్చాయి కదా. మనిషి బ్రతికి ఉన్నప్పటి కంటే చనిపోయాకే విలువ పెరుగుతుందంటోంది జపాన్ సర్కార్. జపాన్ లో ఎవరైనా చనిపోతే.. వారి బూడిదను నీటిలో కలిపేవారు. ఆ బూడిదలో డెంటల్ ఫిల్లింగ్స్, బోన్ ఇంప్లాంట్స్ కు వాడిన పల్లాడియం, టైటానియం వంటి విలువైన లోహాలున్నట్లు గుర్తించింది ప్రభుత్వం.
వెంటనే ఐదేళ్లలో చనిపోయిన 15 లక్షల మంది బూడిద నుంచి లోహాలను సేకరించి విక్రయించింది. తద్వారా ప్రభుత్వానికి రూ.400 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ఆదాయాన్ని పబ్లిక్ ప్రదేశాలను డెవలప్ చేయడంతో పాటు.. దేశంలో ఉన్న శ్మశాన వాటికల నిర్వహణ కోసం ఖర్చు చేస్తోంది. మనిషి బతికున్నప్పుడే ఏదైనా.. చనిపోయాక ఏం ఉపయోగం లేదనుకుంటాం కదా. చూశారా మరి జపాన్ ప్రభుత్వం చనిపోయిన తర్వాత మనుషుల బూడిదతో కూడా డబ్బు సంపాదిస్తోంది. దీన్ని బట్టి మనిషి చితాభస్మం కూడా విలువైందేనని అర్థమవుతోంది.