- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భక్తులతో ఐదవ శక్తిపీఠం కిటకిట.. హోరెత్తిన శివనామ స్మరణం
దిశ, అలంపూర్: భక్తులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం అన్ని మాసాలతో పోలిస్తే కార్తీక మాసం చాలా పవిత్రమైనది. మహిళా భక్తులు ప్రత్యేకంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తూ శివనామ స్మరణం జపిస్తూ దీపారాధన చేయడం ఈ మాసానికి ప్రత్యేకత. అందులో భాగంగా అలంపూర్ పుణ్యక్షేత్రమైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వరుని ఆలయాలు కార్తీక మాసం పురస్కరించుకొని భక్తుల తాకిడితో కిటకిటలాడుతున్నాయి. తుంగభద్ర నది తీరాన పుష్కర ఘాట్ లో ఉన్న పుణ్య స్నానాలు ఆచరించి కార్తీకదీపాలను నది ఒడిలో వదులుతూ... శివనామస్మరణతో ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆరోజు ఈరోజు అని తేడా లేకుండా... ప్రతినిత్యం జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిస్తున్నారు. కార్తీక మాసం ముగింపు దశలో ఉండటంతో కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు, బాల బ్రహ్మేశ్వరునికి అభిషేకాలు చేస్తూ దర్శించుకుంటున్నారు.