- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత సంతతి వ్యక్తికి యూకేలో జీవిత ఖైదు: 30ఏళ్ల నాటి హత్య కేసులో లండన్ కోర్టు తీర్పు
దిశ, నేషనల్ బ్యూరో: 30ఏళ్ల క్రితం ఓ మహిళను హత్య చేసిన కేసులో భారత సంతతి వ్యక్తికి లండన్ కోర్డు జీవిత ఖైదు విధించింది. భారత సంతతికి చెందిన సందీప్ పటేల్ అనే వ్యక్తి 1994లో లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ ప్రాంతంలో మెరీనా అనే మహిళను అత్యంత దారుణంగా మర్డర్ చేశాడు. ఆమెను దాదాపు 140 సార్లు పొడిచాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి కేసు దర్యాప్తు చేపట్టారు. అనేక సాక్షాధారాలను పరిశీలించిన అనంతరం గతేడాది జనవరి 19న సందీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా ప్రాంతంలో లభించిన వేలిముద్రలు, ఇతర ఆధారాలు సందీప్‌తో సరిపోలాయి. ఈ క్రమంలోనే ఇవన్నీ మెట్ పోలీసులు కోర్టులో అందజేశారు. దీంతో విచారణ చేపట్టిన లండన్ కోర్టు నిందితుడికి జీవితఖైదు విధిస్తూ తీర్పు నిచ్చింది. ఈ కేసును స్పెషలిస్ట్ క్రైమ్ ఆఫీసర్స్ విచారణ చేపట్టారని, వారు తీవ్రంగా శ్రమించి సాక్ష్యాలను సేకరించాలని పోలీసులు తెలిపారు. ‘ఇన్ని సంవత్సరాలకు మెరీనా హంతకుడికి న్యాయం జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. కానీ ఈ విషయాన్ని వినడానికి ఆమె భర్త లేకపోవడం బాధాకరం’ అని సెంట్రల్ స్పెషలిస్ట్ క్రైమ్ స్పెషలిస్ట్, కేస్‌వర్క్ టీమ్ హెడ్ డిటెక్టివ్ సూపరింటెండెంట్ కేథరీన్ గుడ్‌విన్ తెలిపారు.