అమెరికాలో కేరళకు చెందిన కుటుంబం అనుమానాస్పద మృతి

by Shamantha N |
అమెరికాలో కేరళకు చెందిన కుటుంబం అనుమానాస్పద మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో అనుమానాస్పదస్థితిలో భారతీయ కుటుంబం మరణించింది. ఆ ఇంట్లో గన్ ని గుర్తించారు పోలీసులు. దీన్ని మర్డర్-సూసైడ్ అని అనుమానిస్తున్నారు పోలీసులు. కాలిఫోర్నియాలోని శాన్ మాటియోలో ఈ ఘటన జరిగింది. కేరళకు చెందిన ఆనంద్‌ సుజాత్‌ హెన్రీ (42), అతని భార్య అలిస్‌ బెంజిగర్‌ (40), నాలుగేళ్ల వయసున్న ఇద్దరు కవలల నోహ్, నీతాన్ ల డెడ్ బాడీలు గుర్తించారు.

కుటుంబానికి చెందిన బంధువు ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ ఆన్సర్ చేయలేదు. ఈ ఇంటి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో స్థానికులతో కలిసి అధికారులకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లే అన్ని డోర్స్ మూసే ఉన్నా.. ఒక కిటికీ మాత్రం తెరిచి ఉంది. దాని ద్వారా అధికారులు ఇంట్లోకి ప్రవేశించారు. బాత్‌రూమ్‌లో దంపతుల మృతదేహాలు కనిపించాయి. వారి బాడీపై బుల్లెట్ గాయాలున్నాయి. సమీపంలోని 9 ఎంఎం గన్, మ్యాగ్జయిన్ స్వాధీనం చేసుకున్నారు.

బెడ్రూంలో పిల్లల డెడ్ బాడీలు కన్పించాయి. వారి బాడీలపై ఎలాంటి గాయాలు లేవు. దీంతో విషప్రయోగం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు అధికారులు. కోర్టు రికార్డుల ప్రకారం ఆనంద్ సుజాత్ 2016లో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. కానీ ప్రొసీడింగ్స్ పూర్తి కాలేదు.

ఆనంద్‌ సుజాత్‌ హెన్రీ తొమ్మిదేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నాడు. మెటా, గూగుల్‌ వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పనిచేశాడు. మెటాలో రాజీనామా చేశాక.. లాగిట్స్‌ అనే ఏఐ కంపెనీని సొంతంగా స్టార్ట చేశారు. కొన్నిళ్ల క్రితమే 2.1 మిలియన్ డాలర్ల విలువైన ఇంటిని కొన్నాడు.

ఈకేసుకు గతంలో మసాచుసెట్స్ లో జరిగిన కేసుకు పోలికలు గుర్తించారు అధికారులు. మాసాచుసెట్స్ లోని 5 మిలియన్ డాలర్ల మాన్షన్ హౌజ్ లో భారత సంతతికి చెందిన దంపతులు వారి టీనేజ్ కూతురితో కలిసి నివసించేవారు. ఇటవలే ఆ సంపన్న కుటుంబం మొత్తం ఇలాగే అనుమానాస్పద మృతి చెందింది. దీంతో ఈ కేసును కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు అధికారులు. కేరళ కుటుంబం అనుమానాస్పద మృతి కేసును శాన్ మాటియో కౌంటీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో స్వాధీనం చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed