- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Modi తో రిలేషన్‌షిప్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు తన కన్నా గొప్ప స్నేహితుడూ ఎన్నడూ లేరని ట్రంప్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ పాలన గురించి కూడా ట్రంప్ మాట్లాడారు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ అద్భుతంగా విధులు నిర్వర్తిస్తున్నారని, అన్ని సమస్యలపై సమన్వయంతో దృష్టి సారిస్తున్నారని కొనియాడారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రంప్.. భారత్‌పై చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఈ సందర్భంగా ఆయన భారత్, మోడీతో తన రిలేషన్, ఇటీవల తన మార్-ఏ లాగో ఆస్తులపై ఎఫ్‌బీఐ దాడులు వంటి మరెన్నో సమస్యల గురించి ప్రస్తావించారు. 'ఇండియా, ప్రధాని మోదీతో నాకు గొప్ప అనుబంధం ఉంది. మేము చాలా మంచి స్నేహితులం. అతడో గొప్ప వ్యక్తి, అద్భుతంగా తన విధులు నిర్వహిస్తున్నాడనే నేను భావిస్తున్నాను. అతడు చేస్తున్న పని అంత సులువైనది కాదు' అని ట్రంప్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా భారత్ తన కన్నా గొప్ప స్నేహితుడిని ఎప్పటివరకు కలిగి లేదని తాను భావిస్తున్నానని ట్రంప్ చెప్పుకొచ్చారు.
Also Read : ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, ఆయన పని అంత సులభం కాదు: డొనాల్డ్ ట్రంప్
- Tags
- Modi