Boris Johnson :ఎంపీ పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా

by samatah |   ( Updated:2023-06-10 06:52:12.0  )
Boris Johnson :ఎంపీ పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా
X

దిశ, డైనమిక్ బ్యూరో : బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పార్లమెంటు సభ్యుడి పదవి(ఎంపీ)కి రాజీనామా చేశారు. తాను అన్ని రకాల కోవిడ్ నియమాలు పాటించినట్లు చెప్పిన బోరిస్ జాన్సన్ హౌస్ ఆఫ్ కామన్స్‌ను తప్పుదారి పట్టించాడంటూ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పార్లమెంటును విడిచిపెడుతున్నందుకు చాలా బాధగా ఉందని జాన్సన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మేయర్‌గా, పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడి ప్రజలకు సేవ చేశాను..ఇది నాకు చాలా గౌరవప్రదమైనది అని ఆయన పేర్కొన్నారు. ‘నేను కొద్దిమంది వ్యక్తుల వల్ల బలవంతంగా బయటకు వెళుతున్నాను. పార్లమెంటు నుంచి నన్ను తరిమికొట్టేందుకు జరుగుతున్న చర్యలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ప్రివిలేజెస్ కమిటీ నుంచి నాకు ఒక లేఖ అందింది. 2001 నుంచి ఎంపీగా ఉన్నాను. నా బాధ్యతలను సీరియస్‌గా తీసుకుంటాను. నేను అబద్ధం చెప్పలేదు, కానీ వారు ఉద్ధేశపూర్వకంగా సత్యాన్ని విస్మరించారు’ అని జాన్సన్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాను ఉపఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు బోరిస్ ప్రకటించారు. కాగా, జాన్సన్ పార్లమెంటును ఉద్ధేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని పార్టీగేట్ ఆరోపించింది.

Advertisement

Next Story