భూ సేకరణను వేగవంతం చేయాలి

by Sridhar Babu |
భూ సేకరణను వేగవంతం చేయాలి
X

దిశ, ఆసిఫాబాద్ : జిల్లాలో వివిధ అభివృద్ధి పనుల కోసం భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి పలుశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కుమ్రంభీం, జగన్నాథపూర్, పీపీరావు ప్రాజెక్టులతో పాటు చెరువులు, కాలువల నిర్మాణం, రైల్వే లైన్ల, సింగరేణి ఉపరితల గనుల ఏర్పాటుకు అవసరమయ్యే భూములు సేకరించాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు రైతుల అంగీకారం తీసుకొని, భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

భూ సేకరణ పై కోర్టులలో ఉన్న కేసులను సత్వరమే పరిష్కారమయ్యే విధంగా కోర్టులకు నివేదికలు సమర్పించి, భూ సేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు జిల్లా రహదారుల భద్రతా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి, 31న నిర్వహించే రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలని, ఇందుకోసం గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ట్రెసా క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

Advertisement

Next Story