- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సముద్రంలో అంతుచిక్కని అద్భుతం.. అది ఏంటో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్ : విశ్వం అంటేనే పెద్ద అద్భుతం. అలాంటి విశ్వంలో అంతుచిక్కని రహస్యాలు, అద్భుతాలు ఎన్నో దాగి ఉన్నాయి. శాస్త్రవిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నా కొన్ని అద్భుతాల వెనక ఉండే రహస్యాలను, వాటి పుట్టుకను తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి ఓ అంతుచిక్కని అద్భుతమే బ్లూ హోల్. అదేంటి బ్లూ హోల్, ఇది ఎక్కడ ఉంది, ఎప్పుడూ దీని గురించి వినలేదే అనుకుంటున్నారా. మరి ఆ బ్లూ హోల్ ఎక్కడ ఉంది, అది ఎలా ఏర్పడింది. దాన్ని ఎప్పుడు గుర్తించారు, ఆ వివరాలన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లూ హోల్ అంటే సముద్రం మధ్యలో ఏర్పడే ఓ పెద్ద నీటిగుంత. ఇవి నీలి రంగులో ఉండడం వలన వీటిని బ్లూ హోల్ అని పిలుస్తారట. మెక్సికో చెటుమల్ బేలోని యుకాటన్ ద్వీపకల్పం సమీపంలో ఈ బ్లూ హోల్‌ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది సుమారుగా 900 అడుగుల లోతు, 1.47 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్టు లైవ్ సైన్స్ నివేదిక తెలిపింది. ప్రపంచంలో ఇది రెండో అతిపెద్ద బ్లూ హోల్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ బ్లూ హోల్స్ లో ఆక్సిజన్ లెవల్ చాలా తక్కువగా ఉంటుందని, దీని ఉపరితలం పై మాత్రమే సూర్యకాంతి ప్రకాశిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇందులోకి వెళ్లడం చాలా ప్రమాదకరమని వారి అభిప్రాయం. అయితే స్కూబా డైవింగ్ చేసే వారు మాత్రం తగిన జాగ్రత్తతో బ్లూ హోల్‌లోకి ప్రవేశిస్తారట. ఈ బ్లూ హోల్స్ ద్వారా జీవం ఎలా మొదలైందో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తల నమ్మకం.