ఎల్బీ నగర్‌లో దారుణం.. ఓ వ్యక్తిని గొడ్డళ్లతో నరికి చంపిన దుండగులు

by Mahesh |   ( Updated:2025-03-23 04:05:11.0  )
ఎల్బీ నగర్‌లో దారుణం.. ఓ వ్యక్తిని గొడ్డళ్లతో నరికి చంపిన దుండగులు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ (LB Nagar)లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని ఇద్దరు ప్రత్యర్థులు గొడ్డళ్లతో దారుణంగా నరికి హత్య (murder) చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భరత్ నగర్(Bharat Nagar) కు చెందిన బొడ్డు మహేశ్ అనే వ్యక్తిని చైతన్యపురి పోలీస్ స్టేషన్ (Police station) పరిధిలోని శివగంగ కాలనీలో శనివారం అర్ధరాత్రి హత్య చేశారు. అయితే మృతుడు మహేశ్ గతంలో ఓ క్లినిక్ లో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసి.. జైలుకు వెళ్లాడు. కొద్ది రోజుల శిక్ష అనంతరం ఇటీవల బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. ఈ సమాచారం అందుకున్న ప్రత్యర్థులు అతన్ని హతమార్చేందుకు ప్లాన్ చేసుకున్నారు.

ఇందులో భాగంగా.. శనివారం అర్ధరాత్రి గొడ్డళ్లతో వెళ్లి మహేశ్ పై దాడి చేశారు. ఈ దాడిలో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కాగా ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన నిందితులు పరారీలో ఉండటంతో.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. అలాగే పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Read More: కారం చల్లి.. కత్తులతో పొడిచి.. యువకుడి పై దాడి..

Next Story

Most Viewed