చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌లో ఒకే ఒక్కడు

by Gantepaka Srikanth |
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌లో ఒకే ఒక్కడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌(IPL)లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) చరిత్ర సృష్టించారు. నాలుగు జట్లపై వెయ్యి పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించారు. కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లపై విరాట్ కోహ్లీ వెయ్యి పరుగులు సాధించారు. నిన్న రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ.. 36 బంతుల్లో 59 పరుగులు చేశారు. ఇందులో మూడు సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి.

మ్యాచ్ చివరి వరకు క్రీజులో ఉండి.. ఆర్సీబీ(Royal Challengers Bengaluru) గెలుపులో కింగ్ కీలక పాత్ర పోషించారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీమ్.. 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. కెప్టెన్‌ రహానె (56), సునీల్‌ నరైన్‌ (44) అద్భుతంగా రాణించారు. ఇక 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. మొదటి నుంచి దూకుడుగా ఆడింది. విరాట్‌ కోహ్లీ (59), ఫిల్‌ సాల్ట్‌ (56) చెలరేగడంతో లక్ష్యాన్ని ఆర్సీబీ 16.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్‌ పాండ్య (3), హేజిల్‌వుడ్‌ (2) రాణించారు.

Next Story