గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం..

by Sumithra |
గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం..
X

దిశ, భద్రాచలం : భద్రాచలం గోదావరి బ్రిడ్జి క్రింద ఓ మృతదేహం ప్రత్యక్షం అయ్యింది. బ్రిడ్జి మీద ప్రయాణించే వాహన చోదకులు మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. మృత దేహాన్ని ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం కొరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఎరుపు రంగు టీ షర్ట్, నలుపు రంగు షాట్ ధరించి వున్నాడు. అతని చేతి పై రజని అనే పచ్చ బొట్టు ఉన్నదని, మొహం గుర్తు పట్టడానికి వీలు లేకపోవడంతో, వేసుకున్న బట్టలు బట్టి, చేతి పై ఉన్న గుర్తులు ఆధారంగా ఆచూకి తెలిసినవారు 8712682107 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

Next Story

Most Viewed