- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘రాబిన్ హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చేసిన స్టార్ క్రికెటర్.. ఆకట్టుకుంటున్న వెల్కమ్ విషెస్ ఫొటోలు

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), శ్రీ లీల(Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’(Robin Hood). వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner) పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), రవి శంకర్(Ravi Shanker) భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మార్చి 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా అతనికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
అయితే నేడు హైదరాబాద్‌లో రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. అలాగే ట్రైలర్ కూడా లాంచ్ చేయబోతున్నారు. ఇక దీనికి స్పెషల్ గెస్ట్‌గా డేవిడ్ వార్నర్ రాబోతున్నాడు. అయితే తాజాగా అతను ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి ఆస్ట్రేలియా నుంచి విచ్చేశాడు. ఈనేపథ్యంలో ఎయిర్ పోర్టులో అతన్ని కలిసి ఫ్యాన్స్, డైరెక్టర్ వెంకీ కుడుముల వెల్‌కమ్ విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఈ లుక్‌లో డేవిడ్ వార్నర్ సూపర్ ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.