‘నవ్విపోనీ.. నాకేంటి సిగ్గు’.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Gantepaka Srikanth |
‘నవ్విపోనీ.. నాకేంటి సిగ్గు’.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: రుణమాఫీ(Runa Mafi), రైతుభరోసా(Rythu Bharosa)పై అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageswara Rao) చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టారు. ‘‘ఎక్కని గుడి లేదు- మొక్కని దేవుడు లేడు.. చేయని శపథం లేదు - ఆడని అబద్దం లేదు.. ఒకటా రెండా.. అక్షరాల 420 అబద్దపు హామీలు’’ అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్(KTR) విమర్శల వర్షం కురిపించారు. నిండు శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై ఇందిరమ్మ రాజ్యం(Indiramma Rajyam) గునపం దింపిందని పేర్కొన్నారు.

చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్‌(Warangal Declaration)కు కాంగ్రెస్ తూట్లు పొడిచిందని అన్నారు. అధికారం కోసం అందరికీ రుణమాఫీ అని మాట్లాడి.. అధికారంలోకి వచ్చాక కొందరికే అని ప్రకటించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ‘నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు - పెట్టెలో ఓట్లు పడ్డాయ్ - జేబులో నోట్లు పడ్డాయ్ - ఢిల్లీకి మూటలు ముట్టాయ్ ఇక ఇచ్చిన వాగ్దానాలు ఉంటే ఎంత గంగలో కలిస్తే ఎంత అన్నట్లుంది కాంగ్రెస్ యవ్వారం’ అని ఎద్దేవా చేశారు.

‘రూ.2 లక్షల వరకు కుటుంబంతో సంబంధం లేకుండా రుణమాఫీ అని ప్రకటించారు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అని చెబుతున్నారు. నాడు రూ. 2 లక్షలు దాటినా రుణమాఫీ అన్నారు. ఇప్పుడేమో రూ. 2 లక్షల పైబడితే మాఫీ లేదంటున్నారు. మిస్టర్ రాహుల్(Rahul Gandhi), మాఫీమాంగో తెలంగాణసే’ అని కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Advertisement
Next Story

Most Viewed