Big Breaking : థాయ్‌లాండ్‌ కొత్త ప్రధానిగా పెటోంగ్టార్న్‌..!

by Maddikunta Saikiran |
Big Breaking : థాయ్‌లాండ్‌ కొత్త ప్రధానిగా పెటోంగ్టార్న్‌..!
X

దిశ, వెబ్‌డెస్క్ : థాయ్‌లాండ్‌ నూతన ప్రధాని పదవికి తమ పార్టీ అధ్యక్షురాలు పెటోంగ్టార్న్‌ షినవత్రాను నామినేట్‌ చేస్తున్నట్లు ఫ్యూ థాయ్‌ పార్టీ గురువారం ప్రకటించింది. పార్టీ సెక్రటరీ జనరల్‌ సోరావాంగ్‌ థియెన్‌థాంగ్‌ ఆమెను నామినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించగానే పాపులిస్ట్ ఫూ థాయి నేతృత్వంలోని 11 పార్టీల సంకీర్ణం నేతలు ఆమెకు మద్దతు ప్రకటించారు. తనకు మద్దతునిచ్చిన సంకీర్ణ భాగస్వాములకు ఆమె కృతజ్ఞతలు తెలియచేశారు. కాగా నైతిక ఉల్లంఘనకు పాల్పడిన కేసులో ప్రస్తుత ప్రధాని స్రెట్టా థావిస్‌ను రాజ్యాంగ న్యాయస్థానం బుధవారం పదవి నుండి తొలగించిన సంగతి తెలిసిందే. కేవలం ఏడాది కాలమే స్రెట్టా థావిస్‌ ప్రధాని పదవిలో ఉన్నారు. శ్రేట్టా తవిసిన్ అంటే తనకు గౌరవం వుందని, ఆయనకు జరిగింది దురదృష్టకరమని పెటోంగ్టార్న్‌ వ్యాఖ్యానించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని, ఆర్థిక సంక్షోభం నుండి థాయ్‌లాండ్‌ దేశాన్ని బయటపడవేయడానికి కృషి చేస్తామన్నారు. ఆగస్ట్‌ 16న పార్లమెంట్ సమావేశం కానుంది. శుక్రవారం పెటోంగ్టార్న్‌ పార్లమెంటు ఓటుకు ఆమోదం పొందినట్లైతే ఆమె థాయ్‌లాండ్‌ రెండో మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించనున్నారు. అయితే పెటోంగార్న్‌ షినవత్రా థాయ్‌లాండ్‌ మాజీ ప్రధాని థాక్సిన్‌ షినవత్రా చిన్న కుమార్తె. థాక్సిన్‌ థాయ్‌లాండ్‌లోనే అత్యధిక సీట్లు గెలుచుకున్న మొట్టమొదటి రాజకీయ నేత. ఆయనకున్న ప్రజాదరణ కారణంగానే ప్రధాని పదవికి పెటోంగ్టార్న్‌ను నామినేట్‌ చేశారని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed