- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Jagdeep Dhankhar: రాజకీయ, ఆర్థిక వృద్ధికి దేశ యువతే చోదక శక్తి: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజకీయ, ఆర్థికవ్యవస్థ, వృద్ధి, సామాజిక సామరస్యం వెనుక యువత, జెన్-జెడ్ ప్రధాన చోదక శక్తిగా ఉందని భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ అన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఆర్థిక జాతీయవాదాన్ని స్వీకరించి దేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలని యువతకు సూచించారు. యువత తమ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, సముద్రం, భూమి, ఆకాశం, అంతరిక్షం అన్ని చోట్ల భారత్ అసాధారణంగా వృద్ధి సాధిస్తున్న సమయంలో ఉన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని తెలిపారు. కొందరు ఆర్థిక లాభంపై శ్రద్ధ చూపిస్తున్నారు. కానీ దేశం ముందుకెళ్లాలంటే ఆర్థిక లాభం కంటే ఆర్థిక జాతీయవాదం ముఖ్యమని గుర్తించాలని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆంట్రప్రెన్యూరల్ స్కిల్స్ పెంపొందించుకోవాలని, కోట్లాది డాలర్ల విలువైన దిగుమతులను తగ్గించేందుకు యువత సరైన పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. దిగుమతులను తగ్గించే అవకాశాలను ఎన్నుకోవాలన్నారు.