- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య
దిశ, మధిర : ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న సాయి వర్ధన్ అనే విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మధిర నియోజకవర్గ పరిధిలోని ముదిగొండ మండల కేంద్రానికి చెందిన సాయివర్ధన్ కృష్ణాపురం ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఆంధ్ర రాష్ట్రం వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన మాడుగుల రాంబాబు, సునీత దంపతులు తమ కుమార్తె సుహాసిని, కుమారుడు సాయి వర్ధన్ తో కలిసి ముదిగొండ మండల కేంద్రంలో ఉంటూ బైక్ మెకానిక్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఈనెల 25న క్రిస్మస్ పండుగకు ఇంటికి వెళ్లిన సాయివర్ధన్ తిరిగి సోమవారం కళాశాలకు వచ్చాడు. సాయివర్ధన్ అదే రోజు రాత్రి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. కళాశాల సిబ్బంది మాత్రం మంగళవారం ఉదయం గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సాయివర్ధన్ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం ఆర్డీఓ జి.నరసింహారావు , వైరా ఏసీపీ రెహమాన్, సోషల్ వెల్ఫేర్ జోనల్ ఆఫీసర్ కె.స్వరూపారాణి, మధిర సీఐ డి.మధు, మధిర తహసీల్దార్ రాళ్లబండి రాంబాబు, రూరల్ ఎస్సై బి.లక్ష్మీ భార్గవి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ప్రేమ వ్యవహారమే కారణమా...
సాయివర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బంది తెలిపారు. ఇంటి నుండి వచ్చిన దగ్గర నుండి ముభావంగా ఉన్నాడని, ప్రేమించడం తప్పని , మీరు ఎవరినీ ప్రేమించి మోసపోవద్దని తోటి విద్యార్థులతో చెప్పినట్లు తెలిసింది. రాత్రి సమయంలో అందరం కలిసి కింద పడుకుందామని పై అంతస్తు నుండి కిందికి వెళ్లామని, రూము తాళం సాయి వర్ధన్ దగ్గరే ఉందని తోటి విద్యార్థులు చెప్పారు. రూమ్ దగ్గరికి వెళ్లి చూడగా ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించాడని పేర్కొన్నారు. దాంతో భయంతో వార్డెన్ కు అధికారులకు, తల్లిదండ్రులకు తెలియజేశామని వారు తెలిపారు.
సాయివర్ధన్ పాయింట్ జేబులో లెటర్
సాయి వర్ధన్ పాయింట్ జేబులో లవ్ లెటర్ రాసి ఉందని, ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని రూరల్ ఎస్సై బి. లక్ష్మీ భార్గవి తెలిపారు. కాగా అది లవ్ లెటర్ కాదని, కవిత రూపంలో ఉన్న లెటర్ అని బంధువులు, విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.
పలు అనుమానాలు
తల్లిదండ్రులు, బంధువులు లేకుండానే సాయివర్ధన్ మృతదేహాన్ని కళాశాల నుండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంపై పలు అనుమానాలు ఉన్నాయని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, ఎమ్మార్పీఎస్, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, వార్డెన్ మోషే నిర్లక్ష్యం కారణంగానే సాయి వర్ధన్ నిండు ప్రాణం పోయిందని నైతికంగా కళాశాల యాజమాన్యం బాధ్యత వహించాలని ఆరోపించారు. మధిర నియోజకవర్గంలో ఎస్సీ హాస్టల్ కు సరైన భద్రత లేదని అన్నారు. ఇదే హాస్టల్లో ముదిగొండ మండలానికి చెందిన మరొక విద్యార్థి గతంలో మరణించాడని గుర్తు చేశారు.
వెంటనే దర్యాప్తు చేయించాలి
సాయివర్ధన్ ఆత్మహత్యపై పలు అనుమానాలు ఉన్నాయని, జిల్లా కలెక్టర్ తో దర్యాప్తు చేయించాలని, ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, ఎమ్మార్పీఎస్, విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 50 లక్షల ఆర్థిక సహాయం చేయాలని కోరారు.
కళాశాల ప్రిన్సిపాల్, వార్డెన్ సస్పెన్షన్
సోషల్ వెల్ఫేర్ ఎస్సీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, వార్డెన్ మోషేను సస్పెండ్ చేసినట్లు ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు తెలిపారు.