- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Government: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం పై.. కసరత్తు!
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కోసం మహిళలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కొత్త ఏడాదిలో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తుంది. దీంతో దీని అమలుపై కసరత్తు వేగం చేసింది. ఈ క్రమంలోనే మంత్రుల బృందం కర్ణాటకలో పర్యటిస్తోంది. ఈరోజు సాయంత్రం బెంగళూరులో కర్ణాటక రవాణా మంత్రి రామలింగారెడ్డి, ఆర్టీసీ అధికారులతో ఏపీ మంత్రులు రాంప్రసాద్, అనిత, సంధ్యారాణి భేటీ కానున్నారు. అనంతరం కర్ణాటక సీఎం సిద్దరామయ్యని కూడా ఏపీ మంత్రులు కలుస్తారు.
ఎటువంటి లోటుపాట్లు లేకుండా..
వచ్చే ఉగాదికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వేగంగా అడుగులు వేస్తోంది. తొలత సంక్రాంతికి ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకున్నప్పటికీ.. సాధ్యాసాధ్యాలపై పూర్తిగా కసరత్తు చేసిన తర్వాతే అమలు చేయాలని కొంత సమయం తీసుకున్నారు. పక్కనే ఉన్న కర్ణాటక, తెలంగాణ లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి ఏ మార్గాలు అనుసరిస్తే బాగుంటుంది, అనే అంశాలతో నివేదిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా దీనిని అమలు చేయాలని ప్రభుత్వ సంకల్పం.
ఈ పథకం అమలు చేస్తే..
ఏపీలో రోజుకు సగటున 10 లక్షల మంది వరకు మహిళా ప్రయాణికులు ఉంటారు. వీరందరికీ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బస్సులకు అదనంగా మరో 2వేల బస్సులతో పాటుగా 11 వేలకు పైగా సిబ్బందిని నియమించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రతి రోజు పురుషులు స్త్రీలు కలిపి సగటున రోజుకు 27 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఏసీ సర్వీసులు, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో రోజుకు సుమారు 3 లక్షలమంది ప్రయాణిస్తారు. అంటే మిగిలిన 24లక్షలమంది ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులు.. అదే విశాఖపట్నం, విజయవాడలో అయితే సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ప్రయాణిస్తారు. ఉచిత బస్సు పథకం అమలు చేస్తే ప్రభుత్వం పై ప్రతి నెలా రూ.265 కోట్ల రూపాయల భారం పడుతుంది. అంటే ఏడాదికి రూ.3182 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. మంత్రుల కమిటీ కర్ణాటక తెలంగాణలో పర్యటించి ఓ నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి కి అందజేయనుంది.