రైతుల‌ను న‌ట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే

by Kalyani |
రైతుల‌ను న‌ట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే
X

దిశ, హనుమకొండ : రేవంత్ స‌ర్కారు రైతుల‌ను ప‌చ్చి మోసం చేసిందని, రైతుల‌ను న‌ట్టేట ముంచిందని, రైతు భ‌రోసా మ‌రో మోసం అని నర్సంపేట మాజీ శాస‌న‌స‌భ్యులు పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా బాల‌స‌ముద్రం లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు.. ఓరుగ‌ల్లు వేదిక‌గా 2022 మే 6 న రాహుల్ గాంధీ, ఖ‌ర్గే, ప్రియాంక గాంధీ ఆధ్వ‌ర్యంలో పీసీసీ అధ్య‌క్ష హోదాలో రేవంత్ రెడ్డి రైతు భ‌రోసా ఎక‌రానికి 15 వేలు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. రైతు డిక్ల‌రేష‌న్‌ను సైతం ప్ర‌క‌టించారు. కానీ నిన్న‌టి కేబినేట్ నిర్ణ‌యం రైతుల‌ను మోసం చేయ‌డ‌మే, రేవంత్ నిర్ణ‌యం రైతుల‌ను విస్మ‌యం చెందేలా చేసింది అన్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు, నైతిక విలువ‌లు ఉంటే వెంటనే రాజీనామా చేయాలి అని,

గ‌తంలో ఇదే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రూ.10 వేలు ఇస్తోంది మేము వ‌స్తే రూ. 15 వేలు ఇస్తామ‌ని అన్నారు. కానీ నేడు అదే రేవంత్ రెడ్డి నిసిగ్గుగా అదే నోటితో నిన్న కేబినెట్ అనంత‌రం రూ.6వేలు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రెండు పంట‌ల‌కు ఎక‌రానికి 12 వేలు ఇస్తామ‌న‌డం రైతుల‌ను మోసం చేయ‌డ‌మే రేవంత్ రెడ్డి లక్ష్యం అన్నారు. బోన‌స్ బోగ‌స్ అయ్యింది, నాడు దొడ్డు, స‌న్నాల‌కు బోన‌స్ అని నేడు కేవ‌లం స‌న్నాల‌కే బోన‌స్ ఇచ్చి అది కూడా కేవ‌లం 30 శాతానికే చెల్లించారు అన్నారు. రుణమాఫీ కేవ‌లం 30 శాతానికే అయ్యిందని అన్నారు.

రేవంత్ రెడ్డి పై చీటింగ్ కేసు నమోదు చేయాలి : రైతు రుణ విముక్తి క‌మిష‌న్ రాష్ట్ర మాజీ చైర్మ‌న్ నాగుర్ల వెంక‌టేశ్వ‌ర్లు..

రేవంత్ రెడ్డి పై చీటింగ్ కేసు నమోదు చేయాలి అని రైతు రుణ విముక్తి క‌మిష‌న్ రాష్ట్ర మాజీ చైర్మ‌న్ నాగుర్ల వెంక‌టేశ్వ‌ర్లు అన్నారు. రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశాడు అన్నారు. “ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇప్పుడు తీసుకుంటే 10 వేలు తర్వాత తీసుకుంటే 15 అని చెప్పిండు, రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేసిండు అందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తాం, రేవంత్ పై చీటింగ్ కేసు నమోదు చేయాలి” అని అన్నారు. “కేసీఆర్ చెప్పకుండానే రైతులకు ఎన్నో చేశారు. నాడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్ మీద కోపం తో రైతులకు అన్యాయం చేయాలని, పంటలను ఎండబెట్టాలని చూస్తున్నారని అన్నారు.

నాడు కరెంటు పోతే ఆశ్చర్యం, కానీ నేడు కరెంట్ ఉంటే ఆశ్చర్యం అన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన రైతుల నేస్తం కేసీఆర్ అని అన్నారు. రైతుల‌కు బాకీ ప‌డ్డ నిధుల గురించి తెలిపేందుకు రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు పోస్ట‌ర్‌ల‌ను విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కుడా మాజీ చైర్మ‌న్ మ‌ర్రి యాద‌వ రెడ్డి, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ కో ఆర్డినేట‌ర్ పులి ర‌జినీకాంత్‌, నాయ‌కులు భ‌ర‌త్ కుమార్ రెడ్డి, న‌యీమొద్దీన్‌, ర‌జినీకుమార్‌, ర‌వీంద‌ర్ రావు, జాన‌కీ రాములు, ప‌రుశు రాములు, గౌస్‌, శ్రీ‌ధ‌ర్‌, చాగంటి ర‌మేష్‌, ర‌ఘు, మ‌హేంద‌ర్‌, వెంక‌టేశ్వ‌ర్లు, సంప‌త్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed