- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిర్భయంగా వార్తలు అందిస్తున్న దిశ
దిశ, ఖానాపూర్ : దిశ డిజిటల్ దిన పత్రిక రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిర్భయంగా ప్రజలకు వార్తలు అందిస్తూ ముందుకు దూసుకుపోతుందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ ఆదివారం ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి గ్రామ చివర్లో ఉన్న సదర్మాట్ ఆయకట్టు పరిధిలోని ప్రకృతి వనంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా దిశ దిన పత్రిక క్యాలెండర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిర్భయంగా ప్రజలకు గంటల వ్యవధిలో వార్తలు అందుచే దమ్మున్నది దిశ డిజిటల్ దిన పత్రిక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజురా (చిన్నం)సత్యం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మల రమేష్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ మజీద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజాద్ ఖాన్, శైలేందేర్ రెడ్డి, దిశ పత్రిక విలేకరులు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.