సీఎంఆర్‌ కాలేజీ కేసు.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

by Mahesh |
సీఎంఆర్‌ కాలేజీ కేసు.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ(CMR Engineering College)లోని అమ్మాయిల హాస్టల్ బాత్ రూమ్‌లో విడియో రికార్డు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై విద్యార్థినిలతో పాటు ABVP, SFI వంటి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. దీంతో కాలేజీ ప్రాంగణం మొత్తం అందోళనగా మారింది. కాగా ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ మహిళా కమిషన్(Telangana Women's Commission).. ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేపట్టగా.. సీఎంఆర్‌ కాలేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హాస్టల్ బాత్ రూమ్‌ల పక్కనే ఉన్న వంట గది ఉండటంతో.. అందులో పని చేసే వారిని పోలీసులు(Police) విచారించారు.

దీంతో వారు అమ్మాయిల హాస్టల్లోని బాత్రూమ్‌ల్లో తొంగిచూసినట్లు స్పష్టమైంది. బీహార్‌కు చెందిన నందా కిశోర్‌, గోవింద్‌ కుమార్‌ అరెస్ట్‌ చేశారు. వీరిద్దరితో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీఎంఆర్‌ కాలేజీ చైర్మన్‌ చామకూరు గోపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో కాలేజీ డైరెక్టర్‌ జంగారెడ్డి, ప్రిస్సిపల్‌ అనంతనారాయణ, వార్డెన్‌ ప్రీతిరెడ్డి, క్యాంపస్‌ వార్డెన్‌ ధనలక్ష్మి ఉన్నారు. కాగా నిందితులు కిశోర్, గోవిందులు గతంలో విద్యార్థులను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయమై విద్యార్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని యాజమాన్యం వారిని వదిలిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఏది ఏమైనప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన ఈ కేసులో విద్యార్థినులు, విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగా పురోగతి లభించింది.

Advertisement

Next Story

Most Viewed