- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Self motivation : ఇబ్బందులు వస్తే రానీ.. మిమ్మల్ని తీర్చిదిద్దుతాయ్!!
దిశ, ఫీచర్స్ : ‘‘సందర్భమేదైనా సరే ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడి పారిపోకండి. కష్టాలకు ఎదురొడ్డి నిలవండి’’ అంటారు పెద్దలు. ఎందుకంటే అవి మనల్ని అలర్ట్ చేస్తాయి. సమస్యల సుడిగుండాల నుంచి బయటపడటం ఎలాగో ఆలోచించేలా చేస్తాయి. ఆత్మ స్థైర్యాన్ని కలిగిస్తాయి. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. అందుకే ఇబ్బందులను ఎదుర్కొన్న వారు ఎందులోనైనా రాటుదేలుతారు. సందర్భం వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలో, సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో అనే అనుభవాన్ని, జ్ఞానాన్ని సంపాదించుకుంటారు.
అసలే చలికాలం పొద్దున్న జర్నీ చేయాల్సి వచ్చింది. కానీ చలి పెడుతుందనే విషయాన్ని మర్చిపోయి అలాగే బయలు దేరుతారు. ఇంకేముంది శరీరంలో వణుకు మొదలవుతుంది. అప్పుడనిపిస్తుంది మీకు ‘‘అయ్యో స్వెటర్ (sweater) వేసుకుని రావాల్సిందనో, కాస్త లేట్ అయి బయలు దేరాల్సిందనో’’ ఇకముందు మార్నింగ్ ప్రయాణం చేయాల్సి వస్తే ఈ అనుభవాన్ని గుర్తు చేసుకొని అలర్ట్ అవుతారు. అంటే ఒక ఇబ్బందికరమైన అనుభవం మిమ్మల్ని ఎలా అలర్ట్ చేసింది కదూ! మొత్తానికి మరోసారి అవస్థలు పడకుండా జాగ్రత్త పడేలా గుణపాఠం నేర్పింది. జీవితంలో మీకు ఎదురయ్యే కష్టాలు, ఇబ్బందులు కూడా అంతే. మనకు ఏదో ఒకటి నేర్పిస్తాయి. అవి చాలా వరకు మనల్ని తీర్చిదిద్దుతాయని, అనుభవాన్ని, జ్ఞానాన్ని ఇస్తాయని నిపుణులు సైతం చెబుతుంటారు.
అవమానాలు, మొహమాటాలు..
తెలిసో తెలియకో మనం గానీ, ఇతరులు గానీ చేసిన పొరపాట్లు, మీరు ఎదుర్కొన్న అవమానాలు, మొహమాటాలు, భావోద్వేగాలు వంటి ప్రవర్తనలు కూడా కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెట్టేవిగా అనిపిస్తుంటాయి. కానీ అనేక విషయాల్లో అవి మనల్ని అప్రమత్తం చేస్తాయి. ఎవరితో ఎలా వ్యవహరించాలో నేర్పుతాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ జర్నల్ స్టడీ ప్రకారం.. ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, నష్టాలు వంటివి ప్రతికూలతలుగా భావిస్తుంటారు చాలామంది. అవి మంచిది కాదని కూడా చెప్తుంటారు. కానీ మానవ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే.. ఆది మానవుని నుంచి ఆధునిక మానవుడి వరకు ప్రతీ ఇబ్బంది నుంచి మనిషి ఒక గుణపాఠం నేర్చుకున్నాడు. సమస్య ఎదురైన ప్రతీసారి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశాడు. ఇప్పుడూ అంతే సామాజిక క్రమాన్ని నిర్వహించడంలో, ఒడిదుడుకులు ఎదుర్కోవడంలో ఇబ్బందులు మనకు సహాయపడతాయి.
మంచి నిర్ణయాలకు ప్రేరణ
ఇబ్బందులను ఎదుర్కొన్న వ్యక్తులు వాస్తవానికి వాటిపట్ల అవగాహన కూడా కలిగి ఉంటారని మీకు తెలుసా? అందుకే ఇబ్బందుల్లోంచి బయటపడ్డ వ్యక్తులు మరోసారి వాటిని దరిచేరనీయకుండా అడ్డుకోగలుగుతారు. అంటే మంచి నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు మనకు ప్రేరణగా నిలుస్తాయి. ఇబ్బందులనే అనుభవాల ద్వారా గుణపాఠాలు నేర్చుకుంటాం. మరోసారి రాకుండా వాటిని నివారించడంలో అవి మనకు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు మోసం, అవమానం, అవహేళన వంటి ఇబ్బందులు మనం ఎదుర్కొన్నప్పుడు వాటివల్ల కలిగే బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి చాలా వరకు మరోసారి అలా జరగకూడదని అనుకుంటాం. అలాగే ఇబ్బందులు ఎప్పుడు ఎదురైనా తిప్పికొట్టాలనే నిర్ణయానికి వస్తారు. ఇబ్బందికర పరిస్థితులు ఎంతలా మార్చేస్తాయో ఇప్పుడు అర్థమైంది కదూ!
సంబంధాలు బలోపేతం..
ఇబ్బందికర పరిస్థితులు మనుషుల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయి. సాధారణంగా మీకు తెలిసిన ఒక వ్యక్తి తన ఇబ్బందుల గురించి మరొక వ్యక్తికి చెప్తున్నారంటే అక్కడ నమ్మకం అనేది ఏర్పడి ఉంటుంది. ఒకవేళ అంతకుముందు అటువంటిది లేకపోయినా ఇబ్బందులను ప్రస్తావించడం కారణంగా అవతలి వ్యక్తి సానుకూలంగా స్పందించడం, అర్థం చేసుకోవడం, సహాయపడటం వంటివి చేసినప్పుడు బాధిత వ్యక్తి కృతజ్ఞతా భావంతో ఉంటాడు. ఎప్పుడైనా అవతలి వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే.. వాటినుంచి బయటపడేందుకు సహాయం పొందిన వ్యక్తి ప్రయత్నిస్తారు. ఇలా బంధాలు బలపడతాయి.
నెట్‌వర్కింగ్ టూల్స్‌గా..
ఇబ్బందులు ఒక సోషల్ నెట్ వర్కింగ్ టూల్స్‌గా ఉపయోగపడతాయని 2011లో జరిగిన ఒక అధ్యయనంలోనూ వెల్లడైంది. ఇవి సాంఘీకరణ సంకేతమని, విశ్వాసాన్ని పెంపొందిస్తాయని, సామాజిక సంబంధాల్లో నిబద్ధతను సూచిస్తుస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఇవి రిఫ్లెక్సివ్ రెస్పాన్స్‌ను రేకెత్తిస్తాయి. ఇబ్బంది పడే వ్యక్తితో ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సందర్భాలు సర్ ప్రైజింగ్ బెనిఫిట్స్ అందిస్తాయని స్టడీలో వెల్లడైంది. అలాగే మీ చుట్టు పక్కల సమాజంలో, వర్క్ ప్లేస్‌లో ప్రజలు, సిబ్బంది, ఉన్నతాధికారులు తేలికపాటి ఇబ్బందిని అనుభవించడంవల్ల వారిలో ప్రొఫెషనల్ స్కిల్స్ మరింత పెరుగుతాయి. ఇక్కడ టీమ్ వర్క్ ప్రోత్సహించబడవచ్చు. వ్యక్తులను వేరు చేయడానికి బదులుగా కనెక్ట్ చేయడంలో ఇబ్బందులు ఏదో ఒక రూపంలో హెల్ప్ అవుతుంటాయి.
సెల్ఫ్ మోటివేషన్‌గా పనిచేస్తాయ్..
వాస్తవానికి ఇబ్బందులు పవర్ ఫుల్ ఎమోషన్స్ కూడా. ఇవి వ్యక్తుల్లో బాధను కలిగిస్తాయి. దాని నుంచి బయటపడే మార్గాన్నీ చూపుతాయి. కంటతడి పెట్టిస్తాయి. కష్టాల నుంచి గట్టెక్కించేలా అలర్ట్ చేస్తాయి. అవమానాలకు గురిచేస్తాయి.. అనుభవాల పునాదిమీద కష్టాలను కూడా లెక్కచేయకుండా ఎదిగే నైపుణ్యాలను మెరుగు పర్చుకునేలా చేస్తాయి. ఎందుకంటే వ్యక్తులు తాము ఎదుర్కొన్న ఇబ్బంది కరమైన భావోద్వేగ పరిస్థితులు మళ్లీ వస్తాయేమోనని భయపడి అలర్ట్ అవుతారు. వస్తే ఎలా ఎదుర్కోవాలో ప్రిపేర్ అవుతారు. సో.. ఇబ్బందులనేవి ఫైనల్లీ మనం ఏం చేయాలో, ఏం చేయాకూడదో తెలుసుకునేలా మోటివేట్ చేస్తాయి. క్రమ శిక్షణను అలవర్చుకోవడంలో, ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ స్థైర్యాన్ని, ధైర్యాన్ని పెంపొందించుకోవడంలో, భయాందోళనల నుంచి బయట పడటంలో, వాస్తవాలను గ్రహించడంలో, లైఫ్ క్వాలిటీని పెంచుకోవడంలో సహాయపడతాయి. సో.. ఇబ్బందులు వస్తే రానీ.. అంతా మన మంచికే!!