Lucknow: లక్నో హత్యల కేసులో ట్విస్ట్.. - ప్లాన్ ప్రకారమే హత్య చేశారన్న పోలీసులు

by Shamantha N |
Lucknow: లక్నో హత్యల కేసులో ట్విస్ట్.. -	ప్లాన్ ప్రకారమే హత్య చేశారన్న పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర్‌ప్రదేశ్‌(UP) రాజధాని లక్నోలో జరిగిన హత్యల(Lucknow murders) కేసులో సంచలనాలు బయటకొచ్చాయి. నిందితుడు అర్షద్ విడుదల చేసిన వీడియోలో చెప్పిన మాటలన్నీ అబద్ధాలని పోలీసులు స్పష్టం చేశారు. ప్లాన్ ప్రకారమే వారిని హత్య చేసి, ఎవరికీ అనుమానం రాకుండా రికార్డు చేశాడని వెల్లడించారు. ఆ వీడియోలో.. భూ వివాదాల నేపథ్యంలో తన చెల్లెళ్లను ఊర్లో వారు విక్రయించాలని చూశారని, అందుకే చంపేశానని అర్షద్‌ చెప్పిన మాటలు నిజం కావని అన్నారు. కేసును తప్పుదోవ పట్టించడానికే ఆ వీడియో సృష్టించినట్లు గుర్తించామన్నారు. అర్షద్‌ చెప్పినట్లు వారికి సొంతఊర్లో ఎటువంటి వివాదాలు లేవని వెల్లడించారు. ఈ కేసులో నిందితులైన అర్షద్, అతని తండ్రి బాదర్‌ ఇంకా పరారీలోనే ఉన్నట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా అతడి ఫోన్‌ను పరిశీలించగా కుటుంబసభ్యులను హత్య చేయకముందే వీడియో రికార్డ్‌ చేసి.. ఎడిట్‌ చేసినట్లు గుర్తించామన్నారు. ఈ హత్యలో నిందితులకు ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో కేసు విచారణ కొనసాగుతోందని తెలిపారు.

ఐదుగురి దారుణ హత్య

ఇకపోతే, జనవరి 1న లక్నోలోని హోటల్‌ గదిలో ఓ వ్యక్తి తన తల్లిని, నలుగురు చెల్లెళ్లను హత్య చేశఆడు. హత్య చేసిన తర్వాత నిందితుడు అర్షద్‌ వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో కొందరు వ్యక్తులు తన చెల్లెళ్లను ఇతరులకు విక్రయించడానికి ప్రయత్నించారని, అందువల్లే తన తండ్రితో కలిసి ఈ ఘోరానికి ఒడిగట్టానని వెల్లడించాడు. అయితే, ఆ వీడియోలో చెప్పిందంతా ఫేక్ అని పోలీసులు తేల్చారు.

Advertisement

Next Story