- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చందుర్తిలో దొంగల బీభత్సం

దిశ, చందుర్తి : చందుర్తి మండల కేంద్రంలో వేరువేరు ఇళ్లల్లో మధ్య రాత్రి 12 గంటల నుండి నాలుగు గంటల మధ్యలో ఈ దొంగతనం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు చెబుతున్న కథనం ప్రకారం తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరగడాన్ని చూస్తే ఎవరో చూసిన వారే ఈ దొంగతనానికి పాల్పడినట్లు చెబుతున్నారు. వెంగలి వినోద గత 25 రోజుల క్రితం తన కొడుకు దగ్గర ఉండడానికి హైదరాబాద్ వెళ్ళిందని, ఇంట్లో ఎవరూ ఉండడం లేదని తెలుసుకొని తాళం పగులగొట్టి ఇంట్లో చొరబడి తన బీరువాలో దాచుకున్న 25 వేల రూపాయలు దొంగలు ఎత్తుకెళ్లారన్నారు.
అలాగే సిర్రం దేవరాజాం ఇంట్లో 15 వేల రూపాయలు చోరీ అయ్యాయని తెలిపారు. సిర్రం రాజవ్వ తన ఇంటికి తాళం వేసి చిన్న కొడుకు ఇంట్లో పడకోవడానికి వెళ్ళిందని, ఉదయం ఇంటికి వచ్చి పగలగొట్టి ఉన్న తాళం చూసి చుట్టుపక్కల వారిని పిలవడంతో వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారన్నారు. అలాగే పల్సర్ బైక్ పోయిందని స్థానిక వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేశారు. ద్విచక్ర వాహనం నెంబర్ TG21A2264 బ్లూ కలర్ ఉంటుందని బైక్ యజమాని ప్రశాంత్ తెలిపారు. స్థానిక ఎస్సై అంజయ్యను వివరణ కోరగా దర్యాప్తు చేస్తున్నామని, దొంగతనం చేసిన వారిని తప్పకుండా పట్టుకుంటామని అన్నారు.