Unni Mukundan: నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను.. దయచేసి అలా చేయకండంటూ హీరో కీలక విజ్ఞప్తి

by Hamsa |
Unni Mukundan: నేను నిస్సహాయ  స్థితిలో ఉన్నాను.. దయచేసి అలా చేయకండంటూ హీరో కీలక విజ్ఞప్తి
X

దిశ, సినిమా: మలయాళ నటుడు ఉన్ని ముకుందన్(Unni Mukundan) తమిళం, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇక ‘జనతా గ్యారేజ్’(Janata Garage) చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత భాగమతి(Bhagamati), యశోద, ఖిలాడి వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఉన్ని ముకుందన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్కో’(Marco). హనీఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 20న మలయాళ భాషల్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక జనవరి 1న తెలుగులో విడుదలవగా.. తమిళంలో జనవరి 3న థియేటర్స్‌లోకి వచ్చింది. కేవలం 30 బడ్జెట్ తెరకెక్కిన మార్కో చిత్రం రూ. 100 కోట్ల వరకు వసూలు చేసింది.

బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో.. పైరసీ కాపీని ఓ వ్యక్తి ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. దీంతో అతన్ని కొచ్చి పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఉన్ని ముకుందన్ ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేశాడు. ‘‘ప్లీజ్ పైరసీలో సినిమాలు చూడకండి. మేము నిస్సహాయులం. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. కేవలం మీరే దీనిని అడ్డుకోగలరు. దయచేసి ఆన్‌లైన్‌లో సినిమాలు చూడటం, డౌన్‌లోడ్ చేయడం వంటివి చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను’’ అని రాసుకొచ్చాడు. ఇక ఉన్ని ముకుందన్ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు క్షమించండి బ్రో అలా చేయలేం అని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed