Nampally Court: నాంపల్లి కోర్టుకు సంధ్య థియేటర్ ఓనర్స్.. బెయిల్ పిటిషన్ దాఖలు

by Shiva |
Nampally Court: నాంపల్లి కోర్టుకు సంధ్య థియేటర్ ఓనర్స్.. బెయిల్ పిటిషన్ దాఖలు
X

దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు (Sandhya Theater Stampede)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమకు రెగ్యులర్ బెయిల్ (Regular Bail) మంజూరు చేయాలని కోరుతూ.. కేసులో A1గా ఉన్న పెద్ద రామిరెడ్డి (Pedda Ramireddy), A2‌గా ఉన్న చిన్నరామిరెడ్డి (Chinna Ramireddy) నాంపల్లి కోర్టు (Nampally Court)లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, వారి పిటిష‌న్‌పై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ చిక్కడిపల్లి పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలోనే మరికొద్దిసేపట్లో పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఇదే కేసులో అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ (Regular Bail Petition)పై కసేపట్లో నాంపల్లి కోర్టు (Nampally Court) తీర్పును వెలువరించనుంది.

Advertisement

Next Story

Most Viewed