TG: న్యూఇయర్ వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పిలుపు

by Gantepaka Srikanth |
TG: న్యూఇయర్ వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డీజీపీ జితేందర్‌(Telangana DGP Jitender)కు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కీలక విజ్ఞప్తి చేశారు. జనవరి 1 నుండి జనవరి 31వరకు జరిగే జాతీయా రోడ్డు భద్రతా మాసం సందర్భంగా అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా మాసంలో భాగంగా వర్క్ షాప్‌లు, సెమినార్లు, డ్రైవర్లకు, స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, కంటి చెకప్ క్యాంపులు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న 97 ఆర్టీసీ డిపోలు, 62 రవాణా కార్యాలయాల్లో భద్రతా నియమాలతో అవగాహన కల్పిస్తూ బ్యానర్ ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు భద్రతా మాసంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్‌లు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు.

అంతేకాదు.. ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్‌(Traffic Awareness)పై అవగాహన కల్పించాలని రోడ్డు భద్రతాపై ఆర్టీసీ రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రోడ్డు భద్రతపై స్కూల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ, ట్రైనింగ్ క్లాస్‌లు, వర్క్ షాప్‌లు, సెమినార్‌లు, కంటి చెకప్ క్యాంప్‌లు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించడానికి ఇప్పటికే రవాణా శాఖ పలు కార్యక్రమాలను చేపడుతోంది. ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేసే ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్‌లను జనవరిలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ జూమ్ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, జేటీసీలు, డీటీసీలు, ఆర్టీవోలు, ఆర్టీసీ ఈడీలు, ఆర్ఎంలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed