- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అభివృద్ధికి ఎల్లవేళలా కృషి : ఎమ్మెల్యే గండ్ర
దిశ, చిట్యాల: మండల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండలంలో నూతన ప్రాంతీయ పశు వైద్యశాల భవనమును శుక్రవారం వేదమంత్రాలతో ఘనంగా ప్రారంభించారు. మండలంలో వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, వివిధ శాఖల అధికారులతో కలిసి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఆరోగ్యకరమైన పశుసంపదను పెంపొందించుకోవాలని, ప్రభుత్వం రైతులకు వ్యవసాయంతో పాటు, పశువు సంపద అభివృద్ధికి సహాయపడుతుందని తెలిపారు.
ఎన్నికల సమయంలో మండలానికి ఇచ్చిన అన్ని హామీలను త్వరలోనే నెరవేస్తామని, మండల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి, ఎంపీడీవో జయశ్రీ, ఎమ్మార్వో హేమ, మండల అధ్యక్ష కార్యదర్శులు గూట్ల తిరుపతి, గడ్డం కొమురయ్య, వ్యవసాయ కమిటీ చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ, అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, జిల్లా నాయకులు రాయకోమురు, ఆరెపల్లి మల్లయ్య, పులి తిరుపతిరెడ్డి, ఓరం సమ్మన్న, కామెడీ రత్నాకర్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు లక్ష్మణ గౌడ్, టౌన్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్, గుర్రం తిరుపతి,శ్రీనివాస్, మల్లేష్, మొగిలి, రాజ్ కుమార్, రవి, రెబల్ సర్వ శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.