- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
6 ఏళ్ల తర్వాత అక్కడికి వెళ్లిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య.. ఎందుకంటే..? పోస్ట్ వైరల్
దిశ, సినిమా: అలనాటి హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘బద్రి’, ‘జానీ’ వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఈ భామ.. అతనితో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు లవ్‌లో ఉండి ఈ జంట పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆద్య, అకిరా నందన్ అనే పాప, బాబు కూడా పుట్టారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని వేరు వేరుగా ఉంటున్నారు. ఇక డివోర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ వేరే పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. కానీ రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తన పిల్లల బాధ్యతలను చూసుకుంటుంది.
అలాగే ఆద్య పేరు మీద యానిమల్ ట్రస్ట్‌ను నిర్వహిస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ జంతువులకు సంబంధించిన వీడియోలు షేర్ చేయడమే కాకుండా తనకు తోచినంత సహాయం చేస్తుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టా వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో ‘6 సంవత్సరాల తర్వాత నేను మళ్లీ విజయవాడకి వచ్చాను’ అంటూ వెల్‌కమ్ విషెస్ తెలిపిన ఫొటోను షేర్ చేసింది.
అయితే ఈ భామ విజయవాడకి దేశంలోనే తొలి మహిళా టీచర్ అయిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. జనవరి 4న విజయవాడలో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయన్న సంగతి తెలిసిందే. అందుకే ఆ కార్యక్రమంలో పాల్గొనడం కోసమే ఆమె నేరుగా కాశీ నుండి విజయవాడ వెళ్ళి పోయినట్లు తెలుస్తోంది. కాగా నిన్నటి వరకు ఆమె తన పిల్లలతో కాశీ ట్రిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.