Gone Prakash Rao : కవిత బీసీ నినాదం పైన గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-03 09:26:07.0  )
Gone Prakash Rao : కవిత బీసీ నినాదం పైన గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha)బీసీ నినాదం(BC Slogan)పై సీనియర్ కాంగ్రెస్ నేత గోనే ప్రకాశ్ రావు(Gone Prakash Rao) తీవ్ర విమర్శలు చేశారు. జైలు నుంచి వచ్చాక ఇది అంతం కాదు..ఆరంభం అని చెప్పి భారత జాగృతి తరుపునా దేశమంతా పర్యటిస్తామని చెప్పిన కవిత అది మానేసి బీసీ నినాదం ఎత్తుకున్నావేందుకని ప్రశ్నించారు. పదేళ్లలో బీసీలకు మీరేం చేశారని, ఈ రోజు బీసీలపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని ప్రశ్నించారు. బీసీలను అడ్డం పెట్టుకుని ధర్నాలు చేయడమా.. సిగ్గులేదా అని విమర్శించారు. సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన లెక్కలను పదేళ్ల బీఆర్ఎస్ వాడుకోలేదని, మీ హయాంలో 33నుంచి 23శాతం మాత్రమే బీసీ రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. కేబినెట్ లో, పార్టీలో కూడా బీసీ రిజర్వేషన్ అమలు చేయలేదని విమర్శించారు.

దళితుడిని సీఎం చేయలేదని, దళితులు 18, ఎస్టీలు 6శాతానికి చెరొక పదవి మాత్రమే ఇచ్చారన్నారు. మాదిగలు, గోండులకు మంత్రి పదవులు ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళా మంత్రి లేదని, రెండోసారి ప్రభుత్వంలోనూ టీడీపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన మహిళలకే మంత్రి పదవులు కట్టబెట్టారన్నారు. సావిత్రిభాయి పూలే జయంతి రోజున ధర్నాలు చేయడం కవిత అవివేకానికి నిదర్శనమన్నారు. అధికారంలో ఉన్న లేకున్నా అసెంబ్లీలో బావ, బామ్మర్ధులు తప్ప బీసీలను, ఇతరులను మాట్లడనివ్వరని, మండలిలో కవిత మాత్రమే లీడ్ చేసిందన్నారు. కవిత బీసీ నినాదం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. కవిత సీఎం అవుతుందని ఓ జాతకుడు చెప్పాడంటని..దీంతో ఆమె కేటీఆర్ కు పోటీగా మారిందన్నారు.

Advertisement

Next Story