అదృశ్యమైన వృద్ధుడు శవమయ్యాడు

by Kalyani |
అదృశ్యమైన వృద్ధుడు శవమయ్యాడు
X

దిశ,కేశంపేట: ఇంటి నుంచి అదృశ్యమైన వృద్ధుడు సమీపంలోని అడవి ప్రాంతంలో ఆదివారం శవమై కనిపించాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని లేమామిడి గ్రామానికి చెందిన పిరికిరాల చెన్నయ్య(67)గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో 4,5 రోజుల క్రితం చెన్నయ్యను కూతురు సౌడం కృష్ణవేణి తన అత్తగారి గ్రామమైన కోనాయిపల్లి గ్రామానికి ఆసుపత్రికి చూపిస్తానని తీసుకువెళ్ళింది. కూతురు ఇంటికి వైద్యం కోసం వెళ్లిన చెన్నయ్య ఉన్నట్టుండి శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామాలలో వెతికినా, దగ్గర బంధువులను అడిగినా ఆచూకీ తెలియరాలేదు. అలాంటిది ఆదివారం కోనాయిపల్లి గ్రామ సమీపంలోని అడవి ప్రాంతంలో చనిపోయి కనిపించాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేస్తున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Advertisement

Next Story

Most Viewed