- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Deoband : ‘దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్’ కీలక నిర్ణయం.. మహిళా సందర్శకుల ప్రవేశంపై బ్యాన్ ఎత్తివేత
దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్(Deoband) పట్టణంలో ఉన్న ప్రఖ్యాత ఇస్లామిక్ విద్యాసంస్థ ‘దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్’(Darul Uloom Deoband) కీలక నిర్ణయం తీసుకుంది. తమ విద్యాసంస్థ ప్రాంగణంలోకి మహిళా సందర్శకుల ప్రవేశంపై ఆరు నెలల క్రితం (మే 17న) విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. మునుపటిలాగే ఇక నుంచి మహిళా సందర్శకులు బుర్ఖా ధరించి, ఫోన్లు లేకుండా విద్యాసంస్థ ప్రాంగణంలోకి ప్రవేశించవచ్చని ‘దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్’ వెల్లడించింది. అయితే క్యాంపస్‌లో ఉన్న టైంలో సోషల్ మీడియా రీల్స్ తీయొద్దని సూచించింది. ఆరు నెలల క్రితం ఈ విద్యాసంస్థ క్యాంపస్‌లోకి వచ్చిన కొందరు మహిళా సందర్శకులు రీల్స్ తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ‘దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్’ నిర్వాహకులు మహిళా సందర్శకుల ప్రవేశంపై బ్యాన్ విధించారు.
ఎట్టకేలకు ఇప్పుడు బ్యాన్ తొలగిపోయింది. ఇక నుంచి మహిళా సందర్శకులు దారుల్ ఉలూమ్ క్యాంపస్‌లోకి ప్రవేశించవచ్చని వైస్ ఛాన్స్‌లర్ అబుల్ ఖాసిం నోమాని తెలిపారు. తాము నిర్దేశించిన కొన్ని నియమాలను వారు పాటిస్తే సరిపోతుందన్నారు. క్యాంపస్‌లోకి ప్రవేశించే వారి పేరు, ఫోన్ నంబరు, చిరునామా, విజిటింగ్ కోసం ఎంత మంది వచ్చారు అనే వివరాలన్నీ రిజిస్టరులో నమోదు చేసుకోనున్నారు.