- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కోతులు స్వైర విహారం.. భయంతో వణికిపోతున్న జనం

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా మాచర్ల(Macharla)లో కోతులు(Monkeys) స్వైర విహారం చేస్తున్నారు. ఇళ్లలోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. చేతికి అందిన తిను బండారాలు లాక్కు పోతున్నారు. ఇళ్లపై తిరుగుతూ ప్రజలకు భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత రెండు రోజులుగా రాత్రి సమయంలోనూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. స్థానిక అటవీ ప్రాంతం నుంచి పట్టణంలోకి గుంపులు, గుంపులుగా వచ్చాయి. ఆహారం, నీటి కోసం దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు, భయాందోళనకు గురవతున్నారు. స్థానిక అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు కోతుల సమస్యకు పరిష్కారం చేపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కోతులు పట్టేవారిని పిలిపించి పలు చోట్లు బోన్లు ఏర్పాట్లు చేశారు. కోతులను పట్టుకుని శ్రీశైలం దోర్నాల అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని తెలిపారు. అయినా సరే స్థానికులు భయాందోళకు గురవుతున్నారు. త్వరగా కోతులను పట్టుకోవాలని కోరుతున్నారు.