- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
R Krishnaiah: బీసీ రిజర్వేషన్లకు సీఎం చొరవ చూపాలి.. ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: జాతీయ స్థాయిలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్రప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలని బీసీ సంక్షేమ సంఘం నేత, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య(R Krishnaiah) కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్టాల్లో(Telugu States) ఉన్న విధంగా కేంద్రంలో స్కాలర్‌షిప్ లు, రియంబర్స్‌మెంట్లు పెట్టే విధంగా చూడాలని, చట్టసభల్లో బీసీ బిల్లు(BC Bill) పెట్టి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా సీఎం చంద్రబాబు(CM Chaandrababu) చొరవ చూపాలని అన్నారు. అంతేగాక తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లో బీసీ బిల్లు పెట్టి, 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పారు. స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లు అవుతున్నా బీసీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగడం లేదని, ఇందుకోసం మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో్ బీసీ సంక్షేమ సంఘం చేసిన పోరాటాల వల్ల బీసీ బిడ్డలకు చదువు, ఉద్యోగ అవకాశాలు వచ్చాయని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం పోరాటం వల్లే రియంబర్స్‌మెంట్లు వచ్చాయని, దీంతో గుడిసెలల్లో ఉండే పిల్లలు కూడా చదువుతున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రిజర్వేషన్లలో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చామని, బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కంటే బీసీ ముఖ్యమంత్రులుగా లేని తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు కొంత న్యాయం జరిగిందన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో బీసీలు ముందున్నారని, విదేశాలకు వెళ్లే వారిలో తెలుగు రాష్ట్రాల బీసీలు ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా బీసీలు ఎక్కువ మంది చదువుకునే విధంగా.. బీసీలను ఐక్యం చేస్తామని, ఇందుకోసం పెద్ద కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. బీసీలు ఐక్యంగా ఉంటేనే మన అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటారని, అందుకే కులమతాలకు, పార్టీలకు అతీతంగా బీసీలు ఏకమై, బీసీల హక్కుల కోసం జరిగే ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు.