- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jaishankar: ట్రంప్ మళ్లీ రావడంపై భారత్‌కు ఎలాంటి బెదురు ఉండదు: జైశంకర్
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ గెలవడంపై చాలా దేశాలు కంగారు పడుతున్నాయి. కానీ భారత్‌కు ఈ విషయంలో ఎలాంటి బెదురు లేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఆదివారం ముంబైలో జరిగిన ఆదిత్య బిర్లా గ్రూప్ స్కాలర్‌షిప్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ప్రపంచ కొత్త మార్గాలను అనుసరిస్తోంది. అందుకు భారత వృద్ధి ఉదాహరణగా తీసుకోవచ్చు. భారత కార్పొరేట్ రంగంలో జరుగుతున్న మార్పులను చూడవచ్చు. తన అభిప్రాయం ప్రకారం ఇది అనివార్యం. వలసరాజ్యాల కాలం తర్వాత భారత్ సహా పలు దేశాలు స్వాతంత్ర్యం పొందాయి. దాంతో స్వంత విధానాలను ఎంచుకోవడం, అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరిగింది. కొన్ని దేశాలు వేగంగా అభివృద్ధి చెందగా, మరికొన్ని మెరుగ్గా కొనసాగుతున్నాయి. వైవిధ్యమైన, బహుళ ధృవాల ప్రపంచంవైపు దేశాలు వెళ్తున్నాయి. అయితే, పశ్చిమాన పారిశ్రామికీకరించిన ఆర్థిక వ్యవస్థలను విస్మరించలేమని, ఆయా దేశాలు ప్రధాన పెట్టుబడి లక్ష్యాలుగా ఉంటాయని ఆయన అన్నారు. ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ పాత, పారిశ్రామిక ఆర్థికవ్యవస్థలు కనుమరుగు కాలేదని, ప్రధాన పెట్టుబడి లక్ష్యాలుగా కొనసాగుతోందని అన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ గెలవడంపై స్పందించ మంత్రి, చాలా దేశాలు అమెరికా గురించి భయపడుతున్నాయి. కానీ ట్రంప్ మళ్లీ రావడంపై అనేక దేశాల తరహాలో భారత్‌కు ఎలాంటి బెదురు ఉండదన్నారు. ట్రంప్ గెలుపు తర్వాత ట్రంప్ అందుకున్న మొదటి మూడు ఫోన్ కాల్స్‌లో భారత ప్రధాని మోడీ ఉన్నారు. ఇది ఇరు దేశాల సత్సంబంధాలను సూచిస్తుందని పేర్కొన్నారు.