Economy: జీ20 దేశాల్లోనే అత్యంత వేగవంతమైన వృద్ధి భారత్ సొంతం: మూడీస్

by S Gopi |
Economy: జీ20 దేశాల్లోనే అత్యంత వేగవంతమైన వృద్ధి భారత్ సొంతం: మూడీస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న జీ20 దేశాల్లోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ మంగళవారం ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్న పన్ను మినహాయింపు చర్యలతో పాటు ద్రవ్య పరమైన విధాన నిర్ణయాల ప్రభావం కారణంగా 2025-26లో 6.5 శాతం వృద్ధి సాధించగలదని అంచనా వేసింది. 2025-26 యూనియన్ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఐటీ మినహాయింపును రూ. 7 లక్షల నుంచ్ రూ. 12 లక్షలకు పెంచడం, ఫిబ్రవరి ఎంపీసీ సమావేశంలో ఆర్‌బీఐ కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం వృద్ధికి కలిసొచ్చిందని మూడీస్ అభిప్రాయపడింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై నివేదికను రూపొందించిన మూడీస్.. అమెరికా కొత్త ప్రభుత్వం అనుసరిస్తున్న గందరగోళ విధానాలు, ప్రపంచ మూలధన నిధులు, సరఫరా వ్యవస్థ, వాణిజ్యం, భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య భారత్ లాంటి ఆర్థికవ్యవస్థలు ఎక్కువ ప్రయోజనాలను పొందగలవు, ఆయా సవాళ్లను ఎదుర్కొనగల వనరులు ఉండటం మరింత కాలిసి రానుంది. ప్రతికూల ప్రభావం వల్ల వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు కొంత నెమ్మదించినప్పటికీ, ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడు సమర్థవంతంగా ఉంటాయి. ఈ కారణాలతోనే భారత్ జీ20 దేశాల్లోనే అత్యధిక వృద్ధిని సాధించగలదు. ఫలితంగా ఈ మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతంగా, 2025-26లో 6.5 శాతంగా వృద్ధిని నమోదు చేయగలదని మూడీస్ వెల్లడించింది. దేశీయంగా ద్రవ్యోల్బణం సైతం గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 4.9 శాతం నుంచి 2024-25లో ముగింపులో 4.5 శాతానికి తగ్గే అవకాశాలు ఉన్నాయి.



Next Story

Most Viewed