- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Breaking: వల్లభనేని వంశీకి మరోసారి సైతం బిగ్ షాక్

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former MLA Vallabhaneni Vamsi)కి మరోసారి సైతం బిగ్ షాక్ తగిలింది. భూ కబ్జా కేసు(Land Grabbing Case)లో ఆయన రిమాండ్‌ను ఈ నెల 15 వరకు విజయవాడ జిల్లా కోర్టు(Vijayawada District Court) పొడిగించింది. పలు కేసుల్లో ఇప్పటికే ఆయన జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే భూ కబ్జా కేసులో వంశీ రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో ఆయనను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ మేరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కాగా గన్నవరంలో సీతామహాలక్ష్మికి చెందిన 9 ఎకరాల భూమిని కబ్జా చేశారని వంశీపై ఫిర్యాదు అందింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో వంశీ తరపున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.
మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ అనుచరుడు రంగాను సీఐడీ కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమతించింది. ఈ మేరకు ఆయనను బుధవారం నుంచి పోలీసులు మరింత లోతుగా విచారించనున్నారు.