సన్న బియ్యం పంపిణీ చరిత్రలో నిలిచిపోయే పథకం : మంత్రి వెంకట్ రెడ్డి

by Aamani |
సన్న బియ్యం పంపిణీ చరిత్రలో నిలిచిపోయే పథకం : మంత్రి  వెంకట్ రెడ్డి
X

దిశ,కనగల్లు: సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకమని,చరిత్రలో నిలిచిపోయే పథకమని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా, కనగల్ మండలం, జి .యడవల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నాలుగు కోట్ల 63 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పేదలు సైతం పెద్దల మాదిరిగానే సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు.గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు 20 లక్షల మందిని రేషన్ కార్డులలో పేర్లు చేర్పించడం జరిగిందన్నారు.రూ.3 కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యాన్ని ఇవ్వనున్నామని తెలిపారు. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నామని చెప్పారు. కనగల్ మండలంలో 20 ఏండ్ల కింద ఒక్కొక్కటి లక్ష రూపాయలతో తాను 500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని ,ఇప్పుడు మళ్లీ ఐదు లక్షలతో ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఉచిత బస్సు, రైతు బీమా, రైతు భరోసా, ఎల్పీజీ కనెక్షన్ లను తమ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు.

కనగల్ మండలంలో రూ.80 కోట్లతో రోడ్ల పనులు చేపట్టడం జరిగిందని, అన్ని గ్రామాలలో డ్రైన్లు, రోడ్లు వేయి స్తున్నామని, ప్రతి గ్రామంలో డ్రైన్లు వేశాకే రోడ్లు వేస్తున్నామని చెప్పారు.జి యడవల్లి చెరువు అలుగు గండి మరమ్మతుకు రూ. కోటి 30 లక్షలు మంజూరు చేయడం జరిగిందని వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు.అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, అనూప్ రెడ్డి, నల్లగొండ ఆర్డీవోవై. అశోక్ రెడ్డి,ఇన్ఛార్జ్ డీఎస్ ఓ హరీష్ , డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీసీవో పత్యా నాయక్,పంచాయతీ రాజ్ ఈ ఈ గిరిధర్, తహసిల్దార్ పద్మ, ఎంపీడీవో సిటీ జయరాం,ఏపిఎం సంకు హరి,వరికుప్పల రవి,తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed